అమరావతి : చంద్రబాబు అమరావతికి జగన్ షాక్ ?

Vijaya


చంద్రబాబునాయుడు కలలుగన్న అమరావతికి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా సమాధి కట్టబోతున్నారా ? అంటే పార్టీవర్గాల ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రప్రజలతో పాటు తనను నమ్ముకున్న వాళ్ళకి రాజధాని అమరావతి పేరుతో  చంద్రబాబు భ్రమరావతిని చూపించారు. ఎప్పటికప్పుడు  ఆర్కిటెక్టులను మారుస్తు, డిజన్లను మార్చేశారు. చివరాఖరుకు బాహుబలి సినిమాలో చూపించిన సెట్టింగుల్లాంటి భవనాలను కట్టాలని డైరెక్టర్ రాజమౌళితో కూడా మాట్లాడారు. దీన్నిబట్టే రాజధాని నిర్మాణంపైన చంద్రబాబుకు ఎంతటి అవగాహన, చిత్తశుద్ది ఉందో అర్ధమైపోతోంది.



ఇలాంటి భ్రమలన్నీ 2019 ఎన్నికల ఫలితాలతో పటాపంచలైపోయాయి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతగాని తమ్ముళ్ళు, చంద్రబాబు మద్దతుదారులంతా భ్రమరావతి హ్యాంగోవర్లో నుండి బయటపడలేదు. దానికి అదనంగా అమరావతి ప్రాంతంలో కొత్తగా ఆర్ 5 జోన్ ఏర్పాటుచేసి సుమారు 51 వేలమందికి ఇళ్ళపట్టాలను పంపిణీచేసి పక్కా ఇళ్ళకు జగన్ శ్రీకారం చుట్టారు. దీంతో ఇంకా ఎవరికైనా భ్రమరావతిపైన ఆశలుంటే అవికూడా ఆవిరై పోయాయి.



ఇపుడు విషయం ఏమిటంటే సీఆర్డీఏ రద్దుకోసం జగన్ వెయిట్ చేస్తున్నారట. కోర్టులో ఉన్న ఈ వివాదం గనుక ప్రభుత్వానికి అనుకూలమైతే వెంటనే ప్రభుత్వం సీఆర్డీఏని రద్దు చేస్తుందట. రద్దుచేయగానే అమరావతి ప్రాంతంలోనే మరో మూడు టౌన్ షిప్పులు ఏర్పాటు చేయాలని జగన్ ప్లాన్ చేశారట. ఇపుడు సమస్య ఏమొచ్చిందంటే రాజధానికోసం సమీకరించిన భూముల్లో సీఆర్డీయే చట్టం ప్రకారం 5 శాతంకన్నా పేదలకు పంపిణీచేసేందుకు లేదు. అందుకనే ఇపుడు ప్రభుత్వం కేవలం 5 శాతం భూములను మాత్రమే పేదలకు పట్టాలు పంపిణీ చేసింది.



అదే సీఆర్డీయే రద్దయితే పేదల భూపంపిణీకి ఆకాశమే హద్దు. అందుకనే కోర్టు తీర్పుకోసం వెయిట్ చేస్తున్నారట. ఇప్పటికే మరో మూడుచోట్ల పేదలకు పంపిణీ చేయటానికి భూములను గుర్తించారట. కోర్టులో తీర్పు గనుక ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే చంద్రబాబు కలల అమరావతి శాశ్వత సమాధి అయిపోయినట్లే అనుకోవాలి. అప్పుడు జగన్ ప్రస్తావిస్తున్న సామాజిక అమారవతి కార్యరూపంలోకి వస్తుంది. మరి ఇప్పటికే గుర్తించిన మూడు ప్రాంతాల్లో ఎంతెంత భూమిని పంపిణీ చేయాలని అనుకుంటున్నారనే విషయంలో క్లారిటిలేదు. బహుశా తీర్పొచ్చిన తర్వాత అన్నీ వివరాలు బయటకు వస్తాయేమో.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: