టాక్స్ ఎఫెక్ట్: పాల కంపెనీల వింత మోసం?
దాని వల్ల కిలో గ్రామ్ అంటే 1000 గ్రాములు కాబట్టి ఈ టాక్స్ ఎక్సమ్ప్షన్ కోసం వాటి తూకాన్ని ఒక 75 గ్రాములు తగ్గించి 925 గ్రాములు మెన్షన్ చేస్తారు. దీనివల్ల వాళ్లకు ట్యాక్స్ తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్యాకెట్ బేసిడ్ జిఎస్టి, ఫైనల్ బేస్డ్ జిఎస్టి అని వస్తున్నాయి కాబట్టి పూర్తి తూకంతో ఇచ్చే అవకాశం కూడా ఉంది.
అయితే కర్ణాటకలో ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది అని తెలుస్తుంది. కర్ణాటకలో మొన్న జరిగిన ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చి గద్దెనెక్కాక నిత్యవసర వస్తువుల ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలు అయిపోతుంది. కాబట్టి వారు అక్కడ ఒక నిత్యవసర వస్తువు అమ్మకం విషయంలో తెలివిగా తమ కార్యాచరణను చేసుకు వచ్చారు.
జనం వాడే నిత్యవసర వస్తువులలో ఒకటైన పాల ధరలు పెరిగితే ప్రజలు సహించరు. కాబట్టి వారు డైరెక్ట్ గా పాల ధరలను పెంచకుండా తమ తెలివితేటలను ఉపయోగించారని తెలుస్తుంది. అదేమిటంటే పాల ధరలను పెంచకుండా 500 గ్రాములు లేదా 500 మిల్లీలీటర్లు ఉన్న పాల ప్యాకెట్ బరువుని, 450 గ్రాములు లేదా 450మిల్లీ లీటర్లు కి తగ్గించారని సమాచారం. దీని వల్ల ధరలు పెంచకుండానే ఆ వస్తువులను లేదా ఆయా పదార్థాలను అమ్మే టెక్నిక్ ని ఫాలో అవుతున్నారు. మరి అర లీటర్ ప్యాకెట్ కి 450మిల్లీలీటర్ల పాలు ఇస్తున్నప్పుడు ప్రజలు ధరను కూడా తగ్గించే ఇవ్వాలి అంటున్నారు మరి కొంతమంది.