ఆంధ్రా అప్పులపై అసలు లెక్కలు ఇవీ?
2023 నాటికి 4,42,442 కోట్లని తెలిపారు. అంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.5 శాతం. గతంతో పోల్చితే మూడు శాతం అప్పులు ఎక్కువగా చేశామని ఒప్పుకుంటున్నారు. చంద్రబాబు పాలనలో ఏడు శాతం పైగా అప్పులు పెరిగితే నాలుగేళ్లలో కేవలం మూడు శాతమే అప్పులు పెరిగాయని అంటున్నారు. ఆ లెక్కలను వివరించే ప్రయత్నాలు చేశారు. టీడీపీ హాయంలో పెరిగిన అప్పుల కంటే వైసీపీ హాయంలో కేవలం మూడు శాతమే పెరిగిందని పేర్కొన్నారు.
2014-19 లో అప్పుల వార్షిక వృద్ది రేటు 14.4 శాతం, 2019 నుంచి 22 వరకు అప్పుల వార్షిక వృద్ధి రేటు 12.4 శాతం అని చెప్పారు. చంద్ర బాబు హయాంలో కంటే వార్షిక వృద్ది రేటు ఎక్కువ అని చెప్పారు. 2014-19 నాటికి రాబడులు ఆరు శాతం వృద్ధి అని 19-23 లో 16 శాతం వృద్ధి అని పేర్కొన్నారు. టోటల్ గా చంద్రబాబు హాయంలో అప్పులు ఎక్కువగా చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తక్కువగా చేశామని తెలిపారు. కానీ తమ ప్రభుత్వంపై ఎక్కువ అప్పులు చేసినట్లు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.