పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దాంతో పాటు ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ లో నటించిన ఫాహాద్ నటన కూడా అదే రేంజ్ లో ఉంది. పుష్ప టు తో మళ్లీ ప్రేక్షకులను మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఈ ఇద్దరు ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పుష్ప 2 సినిమా నుండి ఫహద్ ఫాజిల్ పుట్టినరోజు సందర్భంగా
ఆయనకి సంబంధించిన ఒక పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. దాంతోపాటు బన్వర్ సింగ్ షెకావత్ సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చిత్ర బృందం ఆ పోస్టులో పేర్కొన్నారు. పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఎంతలా ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మలయాళ నటుడే అయినప్పటికీ తెలుగులో కూడా ఈయనకి స్టార్ హీరోకి ఉన్నంత రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ఒక కొత్త పోస్టర్ని ఈ సందర్భంగా విడుదల చేయడంతో ఆయన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని స్టైలిష్ గా సిగరెట్ తాగుతూ
కనిపిస్తున్న ఆయన పోస్టర్ ఒక రేంజ్ లో ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుంది అని కూడా తెలియజేశారు మేకర్స్. అయితే ఈసారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి వస్తున్నాడు అంటూ ఆయన పోస్ట్ కింద ఒక క్యాప్షన్ కూడా జోడించారు మేకర్స్. ఇదిలా ఉంటే ఇక పుష్పటులో అల్లు అర్జున్ మరియు ఫహాద్ మధ్య వచ్చే సన్నివేశాలు ఒక రేంజ్ లో ఉంటాయని తెలుస్తోంది. ఇక పుష్ప టు పై ఈ విధంగా భార్య అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్. అయితే పుష్ప వన్ లో కంటే పుష్ప టు లో ఫహాద్ పాత్ర చాలా నెగిటివ్గా ఉంటుందని అంటున్నారు. ఆయన ఈ సన్నివేశాలు సినిమాకే వన్ ఆఫ్ ది హైలెట్ అని అంటున్నారు..!!