అమరావతి : మంత్రులు చిరంజీవికి షాకిచ్చారా ?

Vijaya


మామూలుగా అయితే చిరంజీవి వివాదాలకు దూరంగా ఉంటారు. తనను ఎవరైనా విమర్శించినా, తనపై ఆరోపణలు చేసినా వెంటనే స్పందించరు. రాజకీయ వ్యవహారాల గురించైతే అసలు నోరుకూడా విప్పటంలేదు. అలాంటిది ఏమైందో ఏమో అనవసరంగా ప్రభుత్వంపై మాట్లాడి చెత్త నెత్తినేసుకున్నారు. సినిమా ఫంక్షన్లో మాట్లాడుతు యాక్టర్ల రెమ్యునరేషన్ గురించి ప్రభుత్వానికి ఎందుకంటు ప్రశ్నించారు. ప్రత్యేకహోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి చూసుకోకుండా సినీ పరిశ్రమపై ఎందుకు పడ్డారని నిలదీశారు. పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం వేయటం న్యాయమేనా అని అడిగారు.



తాను  ప్రభుత్వాన్ని నిలదీసినా ఎవరు ఏమీ మాట్లాడరని అనుకున్నారేమో. సడెన్ గా కొడాలినాని, పేర్నినాని ఘాటుగా కౌంటర్లు ఇచ్చేటప్పటికి చిరంజీవి మైండ్ బ్లాంక్ అయ్యుంటుంది. కొడాలి మాట్లాడుతు అనవసరమైన సలహాలు ప్రభుత్వానికి ఇచ్చేబదులు పకోడిగాళ్ళకే ఇచ్చుకోమన్నారు. సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి ఎవరు మాట్లాడారో చెప్పమని చిరంజీవికి కౌంటరిచ్చారు. ఇక పేర్నినాని మాట్లాడుతు సినిమా హీరోలుగా ఇంతమంది ఉన్నా ఎవరి రెమ్యునరేషన్ గురించి ఏ పార్టీ అయినా ప్రస్తావించిందా చెప్పమని నిలదీశారు.



అసలు సినిమాలను, రాజకీయాలను కలిపేసింది పవన్ కల్యాణ్ కాదా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రవిభజన జరిగినపుడు కేంద్రమంత్రిగా ఉన్న చిరంజీవి ప్రత్యేకహోదాను చట్టంలో ఎందుకు పెట్టించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని సంవత్సరాలు మాట్లాడకుండా ప్రత్యేకహోదా గురించి ఇపుడే ఎందుకు ప్రస్తావించారో సమాధానం చెప్పమన్నారు.



మంత్రి అమర్నాధ్ మాట్లాడుతు అసలు రాజకీయాలు, సినిమాలను కలిపేసిందే పవన్ కల్యాణ్ అన్న విషయం చిరంజీవికి తెలీదా అని ప్రశ్నించారు. అసలు రెమ్యునరేషన్ గురించి పదేపదే చెప్పుకున్నది పవనే అన్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. నిజానికి ప్రభుత్వంలో ఎవరూ సినీతారల రెమ్యునరేషన్ గురించి మాట్లాడనేలేదు. ప్రభుత్వాన్ని పవన్ నోటికొచ్చినట్లు మాట్లాడి టార్గెట్ చేస్తున్నారు కాబట్టే మంత్రులు కూడా పవన్ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. రెమ్యునరేషన్ గురించి పవన్ మాట్లాడిన తర్వాతనే మరో మంత్రి అంబటి రాంబాబు కేంద్రప్రభుత్వానికి బ్రో సినిమా గురించి ఫిర్యాదు చేశారన్న విషయాన్ని చిరంజీవి గుర్తుపెట్టుకుంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: