అమరావతి : రేణూతో బలవంతంగా స్టేట్మెంట్ ఇప్పించారా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో గతానికి చాలా భిన్నంగా రేణూ మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే పవన్ మంచి మనిషట. సమాజానికి మంచి చేయటం కోసమే కుటుంబాన్ని కూడా వదులుకున్నారట. పవన్ డబ్బు మనిషికాదని రేణు సర్టిఫికేట్ ఇచ్చారు. సమాజం కోసం నిరంతరం పవన్ తపించిపోతుంటారని చెప్పారు. రాజకీయంగా తన ఫుల్ సపోర్టు పవన్ కే ఉంటుందన్నారు. కాబట్టి అందరు పవన్ను తన కోణంలో చూసి మద్దతివ్వాలని విజ్ఞప్తిచేశారు.
తాజా వీడియో చూసిన తర్వాత చాలా ఆశ్చర్యమేసింది. ఎందుకంటే పవన్ మాజీ భార్యల్లో రేణు ఒక్కళ్ళే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. గతంలో పవన్ గురించి చేసిన వీడియోలు, ఇంటర్వ్యూల్లో చెప్పిన విషయాలను చూస్తే ఎప్పుడూ పాజిటివ్ గా మాట్లాడిందిలేదు. పవన్ గురించి ఎప్పుడు మాట్లాడినా నెగిటివ్ గానే మాట్లాడారు. పవన్ను రేణు ఉమనైజర్ అన్నట్లుగా పోల్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తనతో కాపురం చేస్తునే పవన్ మరో యువతితో బిడ్డను కనటాన్ని ఏమంటారని రేణు సూటిగా నిలదీసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
పవన్ గురించి రేణు చేసిన కామెంట్లతో ఫ్యాన్స్ కు మండిపోయి ట్విట్టర్లో ఆమెను ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫ్యాన్స్ చేసిన ట్రోలింగులతో రేణు ఏడుస్తు చేసిన వీడియోలు యూట్యూబ్ లో దొరుకుతాయి. అంటే ఏ సందర్భంగా రేణు మాట్లాడినా, కామెంట్లు చేసినా పవన్ గురించి పాజిటివ్ గా ఉండేది తక్కువనే చెప్పాలి. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా పవన్ గురించి ఇంత పాజిటివ్ గా రేణు ఎందుకని వీడియో రిలీజ్ చేశారో అర్ధంకావటంలేదు.
రేణు చెప్పింది కాసేపు నిజమే అనుకుంటే మరి రేణు తర్వాత అన్నా లెజినోవాను పవన్ వివాహం చేసుకున్నారు కదా. ఆమెతో కూడా ఇద్దరు పిల్లలన్ని కన్నారు కదా. సమాజం కోసమే కుటుంబాన్ని వదులుకోవటమే కరెక్టయితే రేణుతో విడిపోయిన తర్వాత పవన్ ఎవరినీ వివాహం చేసుకోకూడదు. ఇక్కడే రేణు అబద్ధం చెబుతున్నట్లు అర్ధమైపోతోంది. ఇక తన దృష్టితో చూసి అందరు పవన్ కు ఎందుకు మద్దతివ్వాలో అర్ధంకావటంలేదు.
వీడియోలో రేణూదేశాయ్ ముఖ కవళికలు చూస్తే ఆమెతో ఎవరో పవన్ గురించి పాజిటివ్ గా మాట్లాడించి వీడియో తీసి దాన్ని రిలీజ్ చేసినట్లే అనిపిస్తోంది. ఆమె ముఖ కవళికల్లో ఎక్కడా మనస్పూర్తితో సంతోషంగా చెబుతున్నట్లు కనిపించలేదు. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా రేణు ఏమన్నా నెగిటివ్ గా వీడియోలు రిలీజ్ చేస్తే ఇబ్బందవుతుందని అనుకుని ముందుగానే మాట్లాడుకుని పాజిటివ్ వీడియో రిలీజ్ చేయించినట్లే అనిపిస్తోంది.