అమరావతి : టీడీపీ, బీజేపీ చేతులు కలిపాయా ?

Vijaya




తెలుగుదేశంపార్టీ, బీజేపీ కలిసి ఐక్యంగా కొత్త పాటను అందుకున్నాయి. ఇంతకీ ఆ కొత్త పాట ఏమిటంటే దొంగఓట్లు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలకు పడతాయని అనుమానం ఉన్న ఓట్లను లక్షల్లో వైసీపీ ఓటర్లజాబితా నుండి ఎత్తేసిందని చంద్రబాబునాయుడు, దగ్గుబాటి పురందేశ్వరి, ఏపి ఇన్చార్జి బండి సంజయ్ కొత్త గోల మొదలుపెట్టారు. దొంగఓట్ల విషయమై ఫిర్యాదుచేయటానికి ఈనెల 28వ తేదీన చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. కేంద్ర ఎన్నికల కమీషనర్ అపాయిట్మెంట్ అడిగారు.




దొంగఓట్ల పేరుతో జెనూయిన్ ఓట్లను ఏరేస్తున్న అధికారులపైన కూడా ఫిర్యాదులు చేయబోతున్నారు. ఇప్పటికే ముగ్గురు అధికారులపై కమీషన్ ఇదే విషయమై వేటు వేసింది. వైసీపీకి సహకరిస్తున్న అధికారుల జాబితాను కూడా కమీషన్ కు అందించబోతున్నారు. దొంగఓట్లపేరుతో వైసీపీకి పడదని అనుమానమున్న లక్షలాది ఓట్లను తొలగించటానికి అధికారపార్టీ నేతలు అధికారులతో కుమ్మక్కయినట్లు టీడీపీ ఆరోపిస్తోంది.



ఇక్కడ విషయం ఏమిటంటే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ మీడియాతో ఆ మధ్య మాట్లాడుతు 2019 ఎన్నికలకు ముందు భారీగా చేర్చిన దొంగఓట్లను ఇపుడు తొలగిస్తున్నట్లు చెప్పారు. 2019 ఎన్నికలకుముందు దొంగఓట్లు చేర్పించారంటే అప్పట్లో అధికారంలో ఉన్నది తెలుగుదేశంపార్టీయే. అయితే ఆ విషయాన్ని టీడీపీ మరుగునపెట్టేసి తప్పంతా వైసీపీదే అన్నట్లుగా ఆరోపిస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలు దొంగఓట్లను చేర్పించటం అన్నది సాధారణ విషయం. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు సేవామిత్ర పేరుతో టీడీపీ చేసిందిదే. అప్పట్లో తెలంగాణా పోలీసులు దాడులు చేసి సేవామిత్ర యాప్ ఆఫీసును సీజ్ చేసి కొందరిని అరెస్టులు కూడా చేశారు.



ఇదే విషయాన్ని పురందేశ్వరి మాట్లాడుతు హైదరాబాద్ లో కూర్చుని ఏపీ ఓటర్ల ట్యాంపరింగ్ జరుగుతోందని మండిపడ్డారు. దొంగఓట్లు చేర్పించటం, ప్రతిపక్షాలకు పడతాయని అనుమానించిన ఓట్లను తీసేయటం ముమ్మరంగా జరుగుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని పురందేశ్వరి కేంద్ర కమీషన్ను డిమాండ్ చేశారు. మొత్తంమీద కొద్దిరోజుల పాటు హడావుడి చేయటానికి  ప్రతిపక్షాలకు దొంగఓట్ల అంశం చేతికి అందివచ్చినట్లుగా అనుకోవాలి. మరో కొత్త అంశం చేతికి వచ్చేవరకు దొంగఓట్ల అంశంతో గోలచేస్తారంతే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: