ఏపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన పురందేశ్వరి....!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఏపీ చీఫ్ ఐనటువంటి పురంధేశ్వరి గారు ఎంతో వివాదస్పద మాటలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంధనానికి సంబంధించిన పన్నులు బాగా ఎక్కువ ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు.అయితే దానికి కారణం ఎంటో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆ పార్టీ అధినాయకుడు ఐనటువంటి జగన్ మోహనరెడ్డి గారు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేసారు.అయితే పెట్రోలియంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు పన్ను కూడా తగ్గించిందని ఆమె గుర్తు చేసారు.

కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం ఇంధనానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు టాక్స్ లు తగ్గించడం లేదని మీడియా సాక్షిగా ఆమె అడిగారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ పై రూ.200, ఉజ్వలగ్యాస్ కనెక్షన్లపై రూ.400 తగ్గించిందని కూడా అన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి గారు. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే జగన్ ప్రభుత్వం ఈ విధం గా పన్నులు వేస్తున్నా కూడా అక్కడ డెవలప్మెంట్ మాత్రం అసలు కనబడడం లేదని చెప్పుకొచ్చారు.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అని పురందేశ్వరి గారు గట్టిగా నిలదీశారు.ఐతే మరీ దీనికి సంబంధించి జగన్ సర్కార్ ఇలాంటి కౌంటర్ వేస్తుందో వేచి చూడాలి. అసలే జగన్ ను కానీ ఆ ప్రభుత్వాన్ని కానీ ఎవరైనా ఏమైనా అంటే అందరూ మంత్రులు ఒకటైపోయి రోజు కు ఒకళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆట ఆడేసుకుంటారు అనేది మాత్రం వాస్తవం.డానికి సాక్షం గా మనం అందరం చూస్తూనే ఉన్నాము. పవన్కళ్యాణ్ మరియు అంబటి రాంబాబు విషయంలో మొన్న జరిగిన సిట్యువేషన్ అనేది ఇంకా మర్చిపోలేదు. కాబట్టి పురందేశ్వరిగారు చెప్పిన మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: