స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ప్రధాన నిందితుడుగా అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది.అంతకు ముందు ఆయన్ని సీఐడీ ఆఫీసుకు తరలించడం జరిగింది. ఇక మరి కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ తరువాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.స్కిల్ డెవలప్మెంట్ స్కాం చేసినందుకు చంద్రబాబుని శనివారం పొద్దున్నే నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక కోర్టులో ప్రవేశపెట్టనున్న తరుణంలో.. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా విజయవాడ సివిల్ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్ కోర్టు వద్ద భారీ భద్రతని ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించడం జరిగింది. ఇక ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు.చంద్రబాబు నాయుడుని విజయవాడ కోర్టు 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు సమాచారం తెలుస్తోంది.
ఏసీబీ న్యాయమూర్తి ముందు చంద్రబాబు నాయుడు తరపున ఇప్పటికే ఆయన కేసులు చూస్తున్న న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపిస్తారని సమాచారం తెలుస్తుంది. ఈ మేరకు ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకి (గన్నవరం) చేరుకున్నారు. ఇక ఏపీ సీఐడీ, సిట్ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించనున్నారు. చంద్రబాబు నాయుడును తమ రిమాండ్కు ఇవ్వాలని ఏపీ సీఐడీ కోరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇక అరెస్ట్ సమయంలో చంద్రబాబు నాయుడితో పాటు ఆయన లాయర్లు సీఐడీ అధికారులతో వాదనలకు దిగారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్ట్ ద్వారా అన్ని అనుమానాలను నివృత్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పడంతో.. చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడానికి అంగీకరించారు.చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో రాష్ట్రమంతా టీడీపి శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వైసీపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు.చూడాలి ఈ వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో మరి.