అమరావతి : తండ్రి, కొడుకులను పట్టించుకోవటం లేదా ?

Vijaya



చాలా కాలంగా తండ్రి, కొడుకులు చంద్రబాబునాయుడు, లోకేష్ ఒకమాటను పదేపదే చెబుతున్నారు. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తిరగబడమని. రాక్షస ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరు రోడ్లపైకి రావాలని, సైకో జగన్ ప్రభుత్వంపై పోరాడాలని గొంతుచించుకుటున్నారు. తాజాగా నర్సాపురం మండలంలో యువగళం పాదయాత్రలో లోకేష్ మాట్లాడుతు జగన్ ప్రభుత్వంపై తిరగుబాటు చేయాల్సిన సమయం వచ్చేసిందని  పిలుపిచ్చారు. అయితే విషయం ఏమిటంటే తండ్రి, కొడుకులు గొంతు చించుకోవటమే కానీ జనాలు ఎవరూ పట్టించుకోవటంలేదు.





జనాలంతా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తుందని అప్పుడు కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చంద్రబాబు, లోకేష్ చాలా ఆశలు పెట్టుకున్నట్లున్నారు. వీళ్ళకి అదనంగా ఎల్లోమీడియా ప్రతిరోజు జగన్ ప్రభుత్వంపై ఎంత వీలైతే అంత బురదచల్లేస్తోంది. జనాలను ఏదో రూపంలో రెచ్చగొట్టాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రయత్నాల్లో భాగంగా ఉన్నవి, లేనివి, గోరంత సమస్యలను కూడా కొండంత సమస్యగా బూతద్దంలో చూపిస్తున్నది.





ఎవరెంత ప్రయత్నాలు చేసినా జనాల్లో మాత్రం చలనం కనబడటంలేదు. జనాల వైఖరే చంద్రబాబు, లోకేష్ , ఎల్లోమీడియాకు మింగుడుపడటంలేదు. పుంగనూరులో ఏదో రకంగా శాంతి భద్రతల సమస్య తీసుకురావాలని చంద్రబాబు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు సంయమనం పాటించటంతో తమ్ముళ్ళ పాచికలు పారలేదు. దాంతో వాళ్ళ ప్లాన్ తిరిగి చంద్రబాబుకే ఎదురు తన్నింది. మొన్న భీమవరం మండలంలో కూడా అలాంటి ప్లానే వేసినా పెద్దగా వర్కవుటయినట్లు లేదు.





తనను చంపటానికి జగన్ కుట్రలు చేస్తున్నాడని, తనపై దాడులకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఒకటి రెండు రోజుల్లో తనను ప్రభుత్వం అరెస్టు చేస్తుందని చంద్రబాబు ఎన్నిచెప్పినా జనాలు పట్టించుకోవటంలేదు. మామూలు జనాలు పట్టించుకోలేదు ఓకే మరి పార్టీ నేతలకు ఏమైంది ? వాళ్ళు కూడా రియాక్టు కావటంలేదే. అంటే చంద్రబాబు చెబుతున్నదంతా కేవలం సింపతి కోసం ఆడుతున్న డ్రామాలని అర్ధమైపోయిందా ? మరి ఇంకేమి చెబితే జనాలు చంద్రబాబును నమ్ముతారు ? జనాల్లో చంద్రబాబుకు సింపతి వస్తుందో అర్ధంకావటంలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: