అమరావతి : షాకుల మీద షాకులు తగులుతున్నాయా ?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా రిమాండుకు బదులు చంద్రబాబును హౌస్ కస్టడీ విధించాలని లాయర్ సిద్దార్ధ లూథ్రా వాదనతో కోర్టు ఏకీభవించలేదు. లూథ్రా అడిగినట్లు చట్టంలో హౌస్ కస్టడీ అన్న ప్రొవిజనే లేనపుడు అలాంటి వాదన చెల్లుబాటు కాదని కోర్టు స్పష్టంగా చెప్పేసింది. భద్రతాపరంగా చూసుకుంటే చంద్రబాబు ఇంటికన్నా రాజమండ్రి సెంట్రల్ జైలే సేఫని ప్రభుత్వం అడిషిన్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది.
అందుకనే 14 రోజుల రిమాండును రాజమండ్రి సెంట్రల్ జైలులోనే గడపాలని కోర్టు చెప్పేసింది. కాకపోతే ఐదురోజుల పోలీసులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ వేసిన పిటీషన్ పై కోర్టు బుధవారం తీర్పు చెప్పబోతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తనను ఏ దర్యాప్తు సంస్ధ కూడా టచ్ చేయలేందని చంద్రబాబుకు బాగా నమ్మకం. అలాంటిది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్కామ్ లో అరెస్టవుతానని ఊహించుండరు. నంద్యాల పర్యటనలో ఉన్న తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేయగానే చంద్రబాబు తట్టుకోలేకపోయారు.
సరే అరెస్టు చేయగానే విజయవాడ ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తీసుకొచ్చారు. వెంటనే కోర్టులో పిటీషన్ వేసి బెయిల్ తెచ్చేస్తారని చంద్రబాబు బలంగా నమ్మారు. అయితే లూథ్రా డొల్లవాదనలతో బెయిల్ ఇవ్వకుండా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాకపోతే చంద్రబాబు అదృష్టం ఏమిటంటే పోలీసు రిమాండు కాకుండా జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఒకరోజు జైలులో ఉండగానే రెండోరోజు అందులో నుండి బయటపడాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నించారు. అందుకనే చట్టంలో లేని హౌస్ కస్టడీ కావాలని పదేపదే వాదించారు. లూథ్రా ఎంతసేపు వాదించినా కోర్టు ఏకీభవించలేదు. చివరకు మూడో పిటీషన్ను కూడా కోర్టు కొట్టేసింది. దాంతో చేసేదిలేక బెయిల్ పిటీషన్ను హైకోర్టులో మూవ్ చేసేందుకు చంద్రబాబు లాయర్లు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి హైకోర్టులో ఏమవుతుందో చూడాలి.