అమరావతి : జగన్ అంటే వణుకుతున్న టీడీపీ
చంద్రబాబునాయుడు అరెస్టు, రిమాండ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటేనే చాలామంది టీడీపీ నేతలు వణికిపోతున్నారు. ఇదివరకు జగన్ను ఉద్దేశించి ఏమి పీకుతావు, బొచ్చు కూడా పీకలేవు, నీకు చేతనైంది చేసుకో అని పదేపదే చాలెంజులు చేసేవారు. లోకేష్ తో పాటు మాజీమంత్రులు దేవినేని ఉమ, చింతకాయల అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడేవారు.
అలాంటిది గడచిన మూడురోజులుగా అసలు వీళ్ళనుండి ఇలాంటి డైలాగులు వినబడటంలేదు. పైగా లండన్ నుండి సోమవారం అర్ధరాత్రి అమరావతకి వచ్చిన జగన్ బుధవారం ఢిల్లీకి వెళుతున్నారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో నరేంద్రమోడీ, అమిత్ షా ను కలవబోతున్నారని పార్టీవర్గాలు చెప్పాయి. మామూలుగా జగన్ ఢిల్లీకి వెళుతున్నారంటేనే టీడీపీ బాగా ఇబ్బందుపడుతుంది. ఏ పథకానికి నిధులు పట్టుకొస్తారో ? ఏ పథకానికి అనుమతులు తీసుకొస్తారో ? పోలవరం ప్రాజెక్టుకు పెండింగు నిధులను విడుదల చేయిస్తారో అని భయపడేవారు.
ఎందుకంటే ఇలాంటివి తీసుకురావటంలో చంద్రబాబు ఫెయిలయ్యారు కాబట్టే. తాను ఫెయిలైన చోట జగన్ సక్సెస్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నారు. అందుకనే జగన్ ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్రం ఏమి మంజూరు చేస్తుందో ఏమి విడుదల చేస్తోందో అని కుళ్ళుకునే వాళ్ళు. ఇలాంటి నేపధ్యంలో చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ ఢిల్లీకి వెళుతున్నారు. కచ్చితంగా తన ప్రోగ్రామ్ రాజకీయ సంబంధితమే అనటంలో సందేహం అవసరం లేదు.
ఒక్క కేసులో అరెస్టు అయి రిమాండుకు వెళ్ళినందుకే చంద్రబాబు, టీడీపీ నేతలు వణికిపోతున్నారు. అలాంటిది మరిన్ని కేసులు పెట్టి అరెస్టు మీద అరెస్టు చేయటానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. తొందరలోనే అచ్చెన్నాయుడు, లోకేష్ అరెస్టు కూడా తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే మోడీ, అమిత్ షా భేటీలో జగన్ ఇంకెన్ని వ్యవహారాలు నడపటానికి అనుమతులు తీసుకుంటారో అనే వణుకు పెరిగిపోతోంది. మరి జగన్ ఢిల్లీకి వెళ్ళాలి, మోడీతో భేటీ అయితే కదా అసలు విషయం తెలిసేది. చూద్దాం ఏమవుతుందో.