సోనియా సభ కోసం కాంగ్రెస్ మాస్టర్‌ ప్లాన్‌?

Chakravarthi Kalyan
హైదరాబాద్‌ లో జరగనున్నసీడబ్ల్యుసీ సమావేశాలు, నగర శివారు ప్రాంతం తుక్కుగూడలో జరగనున్న విజయభేరి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. సభ నిర్వహణకు పీసీసీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల 16 నుంచి 18 వరకు మూడు రోజులపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెంది వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ సజావుగా కొనసాగేందుకు వీలుగా పని విభజన చేసింది. ఇందుకు సీనియర్‌ నాయకులను బాధ్యులుగా చేస్తూ పలు రకాల కమిటీలను ఏర్పాటు చేసింది.


ఈ కమిటీకి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఛైర్మన్‌గా ఉంటారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కన్వీనర్లుగా దాదాపు సీనియర్లందరని భాగస్వామ్యం చేశారు. మొత్తం 39 మందితో రిషెప్షన్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు ఛైర్మన్‌గా ఏడుగురు సభ్యులతో సామిజిక మాద్యమ కమిటీని పీసీసీ ఏర్పాటు చేసింది. పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ ఆర్గనైజింగ్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌ ఛైర్మన్‌గా, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌, సిరిసిల్ల రాజయ్యలను ఛైర్మన్లుగా ఏడుగురితో ట్రాన్స్‌పోర్ట్‌ కమిటీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఏర్పాటు చేశారు.


అంతే కాదు.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఛైర్మన్‌గా, గాలి అనిల్‌కుమార్‌ కో ఛైర్మన్‌గా, కొమ్మూరి ప్రతాప్‌ రెడ్డి కన్వీనర్‌గా 13 మందితో పబ్లిసిటీ, బ్రాండింగ్‌ కమిటీని వేశారు. పీసీసీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ ఛైర్మన్‌గా, ఖైరతాబాద్‌, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డీసీసీ అధ్యక్షులు రోహిన్‌ రెడ్డి, అనిల్‌ యాదవ్‌, సమీర్‌ ఉల్లాహ కన్వీనర్లుగా 12 మంది సభ్యులతో జిహెచ్‌ఎంసీ పబ్లిసిటీ కమిటీ ఏర్పాటైంది.


హర్కర్‌ వేణుగోపాల్‌ ఛైర్మన్‌గా, ఎం.ఎ. ఫహీమ్‌ కో ఛైర్మన్‌గా 29 మంది సభ్యులతో ప్రోటోకాల్‌ కమిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశాలు, సోనియా గాంధీ విజయ భేరి బహిరంగ సభలు తెలంగాణ కాంగ్రెస్ భవిష్యత్‌ను మార్చేస్తాయని స్థానిక నేతలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: