ఆ యుద్ధం.. అమెరికా మనసు మార్చుకుందా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాదిన్నర కావొస్తుంది. అయితే ఈ యుద్ధంలో ఎంతో మంది ఉక్రెయిన్, రష్యా సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ లో చాలా ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ లోని చాలా నగరాలు, పట్టణాలు, గ్రామాలు నామారూపాల్లేకుండా పోయాయి. అయినా కూడా ఉక్రెయిన్ అమెరికా, నాటో దేశాల సహకారంతో ఇంకా యుద్ధం కొనసాగించి అమెరికాపై గెలుస్తామని అంటున్నారు.
అయితే ఉక్రెయిన్ కు రష్యా ను ఓడించడం చేతగావడం లేదని నేరుగా నాటో దేశాలతో కలిసి అమెరికా రష్యాపై యుద్ధం చేయాలని ఆలోచనలో పడింది. దీని గురించి అమెరికా లో చర్చ మొదలైంది. కానీ దీనికి అక్కడి ప్రజలు అస్సలు ఒప్పుకోవడం లేదు. యుద్ధం వల్ల జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ దేశం అమెరికాలోని నగరాలపై బాంబులు వేస్తుంది. విధ్వంసం సృష్టిస్తుంది. అనేక రకాల దాడులకు పాల్పడుతుంది.
ఇలా దాడులతో అమెరికా దెబ్బతినడం ఏ మాత్రం ఇష్టం లేదు. రష్యాతో యుద్దం చేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎందుకంటే యుద్దం ఒకసారి ప్రారంభమైతే అది ఎటు వైపు దారితీస్తుందో ఎందరి ప్రాణాలను బలితీసుకుంటుందో ఎవరికి తెలియదు. ఇక ఆస్తి నష్టం గురించి అయితే చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రష్యాతో నేరుగా యుద్ధం వద్దని అక్కడి ప్రజలు నిరసన తెలుపుతున్నారు. మరి అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.