ఇజ్రాయెల్ పరిస్థితి.. ఇండియాకు వస్తే?
ఈ దుష్కృత్యాలను వీరు వీడియో రూపంలో చిత్రీకరించి బయటకు వదిలారు. దీనిపై ఓ పోర్న్ స్టార్ బదులిస్తూ వీడియో నిలువుగా తీశారు ఏంటి అడ్డంగా తీయాలి అని సమర్థించిన తీరు ప్రతి ఒక్కరిని కలచివేసింది. ఆగ్రహానికి గురి చేసింది. ఈ పరస్థితులను గమనిస్తే మనం ఆధునిక సమాజంలో ఉన్నామా.. లేక ఆటవిక జీవితం గడుపతున్నామా అనే సందేహాలు లేవనెత్తుతున్నాయి.
అక్కడి పరస్థితులు మన దేశంలో ఎందుకు భయాందోళనగకు గురి చేస్తున్నాయి అంటే మన చుట్టూ కూడా పాకిస్థాన్ తీవ్రవాదులు, లష్కరే తోయిబా, ఇజాబుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు ఉన్నారు. మరోపక్క చైనా ఈశాన్య రాష్ట్రాలను రెచ్చగొడుతూ ఉంది. దీంతో అక్కడ అల్లర్లు చెలరేగుతున్నాయి. మణిపుర్ లో కూడా మహిళను వివస్త్రను చేసి ఊరేగించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. మన మధ్యే ఉంటూ పౌర హక్కులు, మానవ హక్కులు అంటూ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నవారు ఉన్నారు.
ఇప్పుడు వీటి అన్నింటికి అడ్డుపడుతున్నాడని భారత ప్రధాని అంటే ద్వేషం. మళ్లీ రేపటి ఎన్నికల్లో మోదీ గెలుపును ఆపడానికి చైనా, పాకిస్థాన్, అమెరికా వాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ముప్పేట దాడిని ఎదుర్కొంటుంది. మనపై ప్రతీకారం కోసం ఖలీస్థానీలు, ముష్కరులు, తీవ్రవాదులు ఎదురు చూస్తూ ఉన్నారు. భవిష్యత్తులో హమాస్ తరహా దాడులకు వీళ్లు ప్రయత్నిస్తే ఊహించడానికే భయమేస్తోంది.a