అమరావతి : టీడీపీలో టెన్షన్ పెరిగిపోతోందా ?

Vijaya



తెలుగుదేశంపార్టీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే స్కిల్ స్కామ్ లో  చంద్రబాబునాయుడుకు బెయిల్ పై మంగళవారం తీర్పు రాబోతోంది.  17ఏ పై సుప్రింకోర్టులో నవంబర్ 9వ తేదీన తీర్పు వస్తుంది.  అలాగే ఫైబర్ గ్రిడ్ స్కామ్ పైన జరిగిన విచారణలో కూడా నవంబర్ 10వ తేదీన తీర్పు వస్తుందని అనుకుంటున్నారు.  ఇవి కాకుండా అసైన్డ్ భూముల కుంభకోణంపైన హైకోర్టులోనే నవంబర్ 1వ తేదీన హైకోర్టు విచారణ మొదలుపెడుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్డు విచారణ కూడా హైకోర్టులో 7వ తేదీనే విచారణ మొదలవుతోంది.





అంటే 17ఏ కేసులో తీర్పు, చంద్రబాబు అరెస్టుపై బెయిల్ విచారణ చాలా కీలకమనే చెప్పాలి. ఈ రెండింటిలో కూడా 17ఏ అన్నది చాలా చాలా కీలకం. ఎందుకంటే చంద్రబాబు భవిష్యత్తంతా 17ఏ విషయంలో సుప్రింకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడుంది. 17ఏ అంటే ప్రజా ప్రతినిధిని అరెస్టు చేసేముందు గవర్నర్ అనుమతి తీసుకోవాలా ? వద్దా అన్నది. సీఐడీ ఏమో 17ఏ అన్నది చంద్రబాబుకు వర్తించదని వాదిస్తోంది. ఎందుకంటే 17ఏ సెక్షన్ అన్నది అమాయకులైన ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టకుండా ఏర్పాటుచేసిన సెక్షన్.





సీఐడీ వాదన ఏమిటంటే 17 సెక్షన్ కు సవరణచేసి 17ఏగా మార్చారు. ఇపుడు చంద్రబాబుపై నమోదైన కేసు నాటికి సవరణ జరగలేదు. అంటే అప్పట్లో కేవలం 17 సెక్షన్ మాత్రమే ఉండేది. కాబట్టి సెక్షన్ 17కి ఏని చేర్చి 17ఏగా సవరణ చేసిన తర్వాత నమోదైన కేసులకు మాత్రమే గవర్నర్ అనుమతి అవసరమవుతుందని సీఐడీ వాదిస్తోంది. చంద్రబాబు లాయర్లేమో చంద్రబాబుకు కూడా 17ఏ వర్తిస్తుందని వాదిస్తున్నారు.





రెండువైపుల వాదానలను విన్న సుప్రింకోర్టు జడ్జిమెంటు రిజర్వుచేసింది. ఆ తీర్పే నవంబర్ 9వ తేదీన రాబోతోంది. ఒకవేళ చంద్రబాబుకు వ్యతిరేకంగా తీర్పొస్తే అప్పుడు టీడీపీకి  చాలా ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. అందుకనే 17ఏ పై తీర్పు వ్యక్తిగతంగా చంద్రబాబుతో పాటు పార్టీకి చాలా కీలకమైన రోజనే అనుకోవాలి. అందుకనే తమ్ముళ్ళందరిలో టెన్షన్ పెరిగిపోతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: