హైదరాబాద్ : నిజాన్ని అబద్ధంగా చూపించిందా ?
జైలునుండి కండీషన్ బెయిల్ పై విడుదలైన చంద్రబాబునాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. అనారోగ్య సమస్యలని చెప్పి బతిమలాడుకుంటే, ప్రభుత్వం కూడా అభ్యంతరం లేదని చెప్పిన తర్వాతే హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మెడికల్ బెయిల్ ఇచ్చింది. అదికూడా అనేక కండీషన్లు పెట్టి, అందుకు చంద్రబాబు అంగీకరించిన తర్వాతే నాలుగువారాల బెయిల్ ఇచ్చింది. సరే ముందుకొమాట తర్వాత మరో మాట చంద్రబాబుకు బాగా అలవాటే.
ఇంతకీ హైకోర్టు పెట్టిన కండీషన్లు ఏమిటంటే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, ర్యాలీలు, బహిరంగసభలు కూడదు, ఎవరితోను ఫోన్లో మాట్లాడద్దు, రాజకీయ భేటీలు వద్దని స్పష్టంగా చెప్పింది. అయినా చంద్రబాబు వినిపించుకోలేదు. దాంతో రెండురోజుల క్రితమే చంద్రబాబుపై హైకోర్టు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తంచేసింది. అయినా చంద్రబాబు హైకోర్టును పట్టించుకోవటంలేదు. దీనికి తాజా ఉదాహరణ ఏమిటంటే జనసేన అధినేత పవన్, నాదెండ్ల మనోహర్ తో భేటీ అవ్వటమే. పరామర్శపేరుతో నేతలందరితోను ఎంచక్కా చంద్రబాబు రాజకీయాలు మాట్లాడేస్తున్నారు.
సీఐడీ బెయిల్ రద్దు పిటీషన్ వేస్తుందోమో, మళ్ళీ కోర్టుకు ఎక్కడ కోపం వస్తుందో అనే భయం ఎల్లోమీడియాలో మొదలైనట్లుంది. అందుకనే చంద్రబాబు నివాసంలో నారా లోకేష్ తో పవన్, నాదెండ్ల భేటీ అయినట్లు కథనం ఇచ్చింది. చంద్రబాబును పరామర్శించిన తర్వాత పవన్, నాదెండ్ల ఇద్దరు లోకేష్ తో భేటీ అయ్యారట. ఏపీలో అనుసరించాల్సిన ఉమ్మడి కార్యక్రమాలు, మ్యానిఫెస్టో గురించి, సమన్వయ కమిటీల పనితీరు గురించి చర్చించారట. తెలంగాణా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, బీజేపీ వైఖరి పైన కూడా వీళ్ళు చర్చించుకున్నారట.
అంటే ఎల్లోమీడియా కలరింగ్ ఎలాగుందంటే చంద్రబాబు పరామర్శ అయిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురు విడిగా కూర్చుని చర్చించుకున్నారట. ఈ చర్చలతో చంద్రబాబుకు అస్సలు సంబంధమే లేదట. చంద్రబాబుతో పవన్, నాదెండ్ల ఎంతసేపు భేటీ అయ్యారు, ఏమి మాట్లాడారు, పవన్, నాదెండ్ల చంద్రబాబుతోనే మాట్లాడారా ? లేకపోతే చంద్రబాబును వదిలేసి లోకేష్ తో మాత్రమే చర్చించారా అనేందుకు ఎలాంటి ఆధారాలుండవు. చంద్రబాబుతో కాకుండా లోకేష్ తోనే పవన్, నాదెండ్ల భేటీ అయ్యారని ఎల్లోమీడియా చెప్పటంలోనే నిజమెంతుందో అందరికీ అర్ధమైపోతోంది.