హైదరాబాద్ : కక్షతోనే ఐటి దాడులా ?

Vijaya


తెలంగాణా ఎన్నికల సమయంలో మొదలైన ఐటి శాఖ దాడులంతా కక్షసాధింపే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి పదేపదే కాంగ్రెస్ అభ్యర్ధులను మాత్రమే టార్గెట్ చేసుకుని ఐటి శాఖ దాడులు చేస్తోంది. దాంతోనే ఇది కక్షసాధింపే అనే అనుమానాలు జనాల్లో పెరిగిపోతున్నాయి. లేకపోతే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్ధుల్లో ఎవరిమీదా ఇంతవరకు ఐటి శాఖ ఎందుకని దాడులు చేయలేదు ? అని జనాల మధ్య చర్చలు పెరిగిపోతున్నాయి.



గురువారం ఉదయం నుండి ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసులరెడ్డి ఇల్లు, ఆపీసు, క్యాంపాఫీసుల పైన ఏకకాలంలో ఐటి ఉన్నతాధికారులు దాడులు మొదలుపెట్టారు. మంగళవారం ఖమ్మం అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు ఇల్లు, ఆపీసులపై దాడులు జరిగాయి. అంతకుముందు జానారెడ్డి, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత నర్సింహారెడ్డి ఇళ్ళపైన కూడా దాడులు జరిగాయి. కాంగ్రెస్ తరపున ఎంతోమంది రియాల్టర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఎన్నికల్లో పోటీచేస్తున్నారు.



ఇదే సమయంలో బీజేపీ, బీఆర్ఎస్ తరపున పోటీచేస్తున్న వారిలో కూడా రియాల్టర్లు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు పోటీచేస్తున్నారు. మరి ఈ రెండు పార్టీల్లో ఏ అభ్యర్ధిమీద కూడా ఐటి శాఖ అధికారులు ఎందుకని దాడులు చేయటంలేదు ? ఐటి శాఖ తమ దాడులన్నింటినీ టార్గెటెడ్ గా కాంగ్రెస్ అభ్యర్ధులు,  నేతల మీదే మాత్రమే చేస్తోంది. దీంతోనే జనాల్లో ఇదంతా కక్షసాధింపులనే విధంగా చర్చలు పెరిగిపోతున్నాయి. జరుగుతున్న  తంతు చూస్తుంటే బీఆర్ఎస్, బీజేపీలు కూడబలుక్కునే చేస్తున్నాయా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి.



ఎందుకంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లు మూడు ప్రత్యర్ధిపార్టీలే. కానీ దాడులన్నీ కాంగ్రెస్ అభ్యర్ధుల మీద మాత్రమే జరుగుతున్నాయి. నిజంగానే బీజేపీ, బీఆర్ఎస్ లు నిజమైన ప్రత్యర్ధిపార్టీలే అయితే ఐటి శాఖ ఉన్నతాధికారులు పై రెండు పార్టీల అభ్యర్ధుల మీద కూడా దాడులు చేయాలి కదా. మరెందుకు దాడులు జరగటంలేదు ? ఇక్కడే జనాల్లో అనుమానాలు పెరిగిపోయి కక్షసాధింపులన్నట్లుగా కన్ఫర్మ్ అవుతున్నాయి. మరి దీని ప్రభావం చివరకు ఎలాగుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: