అమరావతి : గల్లా కీలకనిర్ణయం తీసుకున్నారా ?

Vijaya


గుంటూరు తెలుగుదేశంపార్టీ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాలకు కొంతకాలం దూరంగా జరగాలని డిసైడ్ అయ్యారు. పాలిటిక్స్ నుండి రెస్టుతీసుకోవాలని ఎంపీ డిసైడ్ అయినట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకనే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేయటంలేదని ఇప్పటికే చంద్రబాబునాయుడుకు గల్లా చెప్పేశారట.  తన ప్లేసులో కొత్త అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలని చాలాకాలం క్రితమే గల్లా చెప్పేసినట్లు సమాచారం. మరి రెస్టు, బ్రేకు ఏదైనా తాత్కాలికమేనా లేకపోతే శాశ్వతమా అన్నదే పార్టీకి అర్ధంకావంటంలేదు.



చాలాకాలంగా పార్టీ కార్యక్యమాలకు గల్లా దూరంగా ఉంటున్నారు. ఎంతో అవసరమైనపుడు తప్ప నియోజకవర్గంలో కానీ పార్టీలో కానీ ఎక్కడా కనబడటంలేదు.  నేతలకు కూడా అందుబాటులో ఉండటంలేదు. తప్పని పరిస్ధితుల్లో ఏదైనా ఫంక్షన్లకు హాజరవ్వాలంటే మాత్రమే ఎంపీ నియోజకవర్గంలో కనబడుతున్నారు. దీనికి రెండు కారణాలు ఉన్నాయని సమాచారం. మొదటిదేమో అధినేత వైఖరిపైన అసంతృప్తి. రెండో కారణం పరిశ్రమ విస్తరణ పనుల్లో బిజీగా ఉండటం. ఎంపీగా ఒకవైపు అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గా మరోవైపు గల్లా బిజీగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే.



ఇప్పటికే గ్రూప్ తరపున చంద్రగిరి, చిత్తూరులో యూనిట్లు నడుస్తున్నాయి. కార్పొరేట్ ఆఫీసు హైదరాబాద్ లో ఉంది. ఈ నేపధ్యంలోనే 9 వేల కోట్ల రూపాయలతో కంపెనీని విస్తరించాలని డిసైడ్ అయ్యారు. అందుకు తెలంగాణా ప్రభుత్వంతో ఒప్పందం కూడా చేసుకున్నారు. ఇక్కడ పనులు ఊపందుకున్న తర్వాత హర్యానాలో కూడా మరో యూనిట్ పెట్టాలని అనుకున్నారట. తెలంగాణాలో  పనులు, హర్యానా రాష్ట్రంతో ఒప్పందాలు తదితరాలతో బిజీగా ఉండటం వల్ల రాజకీయాలకు టైం కేటాయించటం కష్టమని గల్లా అనుకున్నట్లు తెలుస్తోంది.



ఇదే సమయంలో అధినేతపైన ఎందుకు అసంతృప్తి అంటే రాష్ట్ర సమస్యలను  పార్లమెంటులో లేవనెత్తే అవకాశం లేకుండాపోయిందట. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రశ్నలు వేసేందుకు లేదని చంద్రబాబు  ఆదేశించారట. పార్లమెంటులో సమస్యలనే ప్రస్తావించలేనపుడు ఇక ఎంపీగా ఉండి ఉపయోగం ఏమిటని గల్లా ఆలోచించారట. అలాగే రాష్ట్ర ప్రభుత్వంతో పొల్యూషన్ సమస్యల వివాదం కోర్టు విచారణలో ఉంది.  అన్నీ కలుపుకుని వచ్చేఎన్నికల నుండి బ్రేక్ తీసుకోవాలని గల్లా డిసైడ్ అయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: