జగన్‌పై ఎల్లో మీడియా విచిత్ర దాడి..?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాల్లో ఎల్లో మీడియా తీరే వేరు. ఆ అక్షరాల్లో నిజాయతీ లేకపోగా..అబద్ధాలను సైతం నిజం చేయగల నేర్పరితనం వారిది. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై అక్షర దాడి చేయడం వారి నేర్పరితనం. తాము అభిమానించే చంద్రబాబు కళ్లలో ఆనందం నింపాలి. తమ సామాజిక వర్గం వారికి మార్గదర్శకంగా నిలవాలి. అందుకు ఎందాకైనా తెగించే నైజం ఎల్లో మీడియా సొంతం. చేతిలో పత్రిక ఉంది కదా అని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతూ ఉంటుంది.


జగన్ నమ్ముకున్న నవరత్నాల పథకాలను ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి. ఇది ప్రస్తుత ఎల్లో మీడియా ముఖ్య ఉద్దేశం. ఒకేసారి నవ రత్నాల్లో రెండు కార్యక్రమాలు. బడిపై మాట తప్పినందుకా నాడు నేడు పై సర్కారు గొప్పలు. కోత కోసి కోతలా.. అమ్మ ఒడిపై లేనిపోని గొప్పలు.  ఒక్కో తల్లికి రూ.15వేలు ఇస్తామని చెప్పారు అంట కదా. ఇప్పుడు  ఆ మొత్తంలో కూడా కోత పెట్టి ఇస్తున్నారని ఎల్లో మీడియాలో కథనాలు రాశారు.


అసలు ఇప్పటి వరకు అమ్మ ఒడి పథకం కింద ఏ ప్రభుత్వం అయినా డబ్బులు ఇచ్చిందా. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకం కోసమే కొంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ల దీనస్థితి ఎలా ఉందో. మరోవైపు భోజనం తిన్న తర్వాత మళ్లీ కొంతమంది పిల్లల్ని పనులకు తీసుకెళ్లే తల్లిదండ్రులు ఉన్నారు.


ఈ విధానాన్ని మార్చాలని అమ్మ ఒడి కింద రూ.15వేలు ఇస్తూ.. దానికి హాజరు ను తప్పనిసరి చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే అలాంటి నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వమే కూలీ ఇస్తోంది. మరోవైపు బాలికలు ఆత్మ గౌరవం కోసం నాడు నేడు పేరుతో పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మిస్తూ అధిక నిధులు వెచ్చిస్తోంది. ఇవన్నీ అనుకోగానే జరిగిపోవు. కొంత సమయం పడుతుంది. కానీ ఎల్లో మీడియాకు మాత్రం ఇవేమీ కనపడవు. పథకంలో లోపాలను ఎత్తి చూపితే తప్పులేదు. పథకమే లోపం అంటే ప్రజలు కూడా నమ్మరు. ఆత్మ విమర్శ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: