తెలంగాణలో ఎలక్షన్స్ కారణంగా టెన్షన్ పడుతున్న ఏపీ సీయం....!!

murali krishna
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఆరు రోజుల సమయం మాత్రమే ఉందన్న సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అదే రోజున ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. అయితే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ కంటే… వైసీపీ పార్టీ ఎక్కువగా టెన్షన్ పడుతుందట.తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… గత నెల రోజులుగా పలు సర్వేలు వస్తున్న సంగతి తెలిసిందే. జాతీయస్థాయి అలాగే రాష్ట్రస్థాయి సర్వే సంస్థలు… తమ రిపోర్టులను ఇప్పటికే ప్రకటించాయి. కొన్ని సర్వే సంస్థలు… ఇంకా సర్వేలు చేస్తున్నాయి. అయితే సర్వే సంస్థలు రిలీజ్ చేసిన సర్వే లెక్కల ప్రకారం… దాదాపు భారత రాష్ట్ర సమితి పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేలా కనిపిస్తోంది.
కానీ కొన్ని సంస్థలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సర్వే రిపోర్ట్ ఇచ్చాయి. ఇప్పుడు ఇదే విషయం వైసిపి పార్టీని కలవరపెడుతోందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాకుండా… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే… వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమకు ఇబ్బంది అవుతుందని వైసిపి భావిస్తోందట. దీనికి వైయస్ షర్మిల. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు వైఎస్ షర్మిల. సీఎం కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఏపీలో ఆ పార్టీకి మరింత బలం చేకూరే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను వైఎస్ షర్మిలకు ఇచ్చేందుకు కూడా అధిష్టానం వెనుకాడదు. ఒకవేళ అదే జరిగితే…. ఏపీ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో వైసిపి పార్టీకి కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. ఇప్పుడు ఇదే విషయం వైసిపి పార్టీకి కునుకు లేకుండా చేస్తోందట. అందుకే తెలంగాణ రాష్ట్రంలో మరోసారి భారత రాష్ట్ర సమితి పార్టీ గెలిచేలా… తమ వంతు ప్రయత్నాలు వైసిపి పార్టీ చేస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: