గోదావరి : లోకేష్ కు అంత సీనుందా ?
యువగళం పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా లోకేష్ చాలా మాటలు మాట్లాడారు. తనపైన ఆరు కేసులు పెట్టినా వెనక్కు తగ్గలేదని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్రను ఆపలేదని, చంద్రబాబునాయుడును జైలుకు పంపితే పాదయాత్ర ఆగిపోతుందని వైసీపీ భ్రమపడిందని లోకేష్ రెచ్చిపోయారు. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందన్నారు. వ్యవస్ధలను మ్యానేజ్ చేసి చంద్రబాబును ప్రభుత్వం 53 రోజులు జైల్లో పెట్టిందని మండిపోయారు.
వైసీపీకి భయం అంటే ఏమిటో తాను రుచిచూపిస్తానని చాలెంజ్ చేశారు. ఏపీలో యుద్ధం మొదలైందని, సైకో జగన్ కు ఎక్సపయిరీ డేట్ దగ్గరకు వచ్చేసిందని చాలా మాటలు మాట్లాడారు. అయితే లోకేష్ మాట్లాడిన మాటలు చాలావరకు అసలు తనకు సూట్ అవుతాయా అనే అనుమానం జనాల్లో పెరిగిపోతోంది. యుద్ధమన్నారు, భయం రుచి చూపిస్తానని హెచ్చరించారు, సైకో జగన్ కు ఎక్స్ పయిరీ డేట్ దగ్గరకు వచ్చేసిందని కూడా చెప్పారు. భయపడకుండా తాను విచారణకు హాజరై విచారణాధికారులను భయపెట్టినట్లు చెప్పుకున్నారు.
అసలు యుద్ధమేంటి ? విచారణాధికారులను భయపెట్టడం ఏమిటి ? భయంలేకుండా విచారణకు హాజరవ్వటం ఏమిటో జనాలకు అర్ధంకావటంలేదు. చంద్రబాబు అరెస్టు కాగానే ఏపీని వదిలేసి ఢిల్లీకి పారిపోయింది ఎవరో అందరికీ తెలుసు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చేంతవరకు లోకేష్ రాజమండ్రి, విజయవాడకు అతిధిలాగ వచ్చి మళ్ళీ వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోయిన విషయం అందరికీ తెలుసు. అసలు పాదయాత్రను ప్రభుత్వం ఎప్పుడు అడ్డుకున్నది ? చంద్రబాబు అరెస్టుతో తనంతట తానుగానే పాదయాత్రను ఆపేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే.\
మూడు నెలల్లో సైకో జగన్ను పిచ్చాసుపత్రికి ప్యాకప్ అవటానికి రెడీగా ఉండాలన్నారు. జగన్మోహన్ రెడ్డి కొట్టిన దెబ్బకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నది ఎవరో అందరు చూస్తున్నదే. సంక్షోభాలు, పోరాటాలు ఎన్టీయార్, చంద్రబాబుకు కొత్తకాదట. ఎన్టీయార్ సంగతిని పక్కన పెట్టేస్తే చంద్రబాబుకు ఎదురైన అతిపెద్ద సంక్షోభం కేసులు, అరెస్టు, జైలు జీవితం మాత్రమే. దాన్ని తట్టుకోలేక చతికిల పడిపోవటం అందరు చూసిందే. ఇంతోటి దానికి లోకేష్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది.