హైదరాబాద్ : బీజేపీకి కొత్త అధ్యక్షుడా ?

Vijaya


తెలంగాణా బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు అధ్యక్షుడిగా ఉన్న  కరీంనగర్ ఎంపీ బండిసంజయ్ స్ధానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించింది పార్టీ. మంచి జోరుమీదున్న బండిని అధ్యక్షుడిగా అగ్రనేతలు ఎందుకు తొలగించారో కూడా తెలీలేదు. దాని ప్రభావం పార్టీమీద తీవ్రంగా పడింది. బాగా స్పీడుమీదున్న పార్టీ జోరు ఒక్కసారిగా తగ్గిపోయింది. బీసీ నేతైన బండిని తప్పించి కిషన్ను నియమించటం బీసీ సామాజికవర్గంలో కూడా ప్రభావం చూపిందని విశ్లేషణలు వచ్చాయి.




ఇపుడు ఎన్నికలైపోయాయి కాబట్టి తాను అధ్యక్షుడిగా తప్పుకుంటున్నట్లు కిషన్ అగ్రనేతలకు చెప్పినట్లు పార్టీ వర్గాల సమాచారం. అప్పట్లో  అధ్యక్షుడిగా చేసినపుడు కూడా ఎన్నికలు అయ్యేంతవరకే ఉంటానని అగ్రనేతలకు కిషన్ స్పష్టంగా చెప్పినట్లు పార్టీవర్గాలు గుర్తుచేస్తున్నాయి. ఇపుడు ఎన్నికలు ముగిసాయికాబట్టి తాను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటానని కిషన్ తాజాగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  చెప్పారట.





మొత్తంమీద పార్టీ బలం మూడు సీట్ల నుండి ఎనిమిది సీట్లకు పెరిగింది. అయితే పార్టీ అగ్రనేతలు అంచనా వేసినట్లుగా గొప్పగా ఏమీ రిజల్టు రాలేదు. ఈ కారణంతో కూడా కిషన్ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తన నియోజకవర్గం సికింద్రాబాద్ పై పూర్తిస్ధాయి దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని నడ్డాతో కిషన్ చెప్పారట. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో కూడా కిషన్ స్పష్టంచేసినట్లు తెలిసింది.





అసెంబ్లీ ఫలితాలు ఆశాజనకంగా లేవు కాబట్టి రేపటి పార్లమెంటు ఎన్నికల్లో పడాల్సిన కష్టాలపై పార్టీ నేతల్లో ఇప్పటి నుండే టెన్షన్ మొదలైంది. అందుకనే మళ్ళీ బండికో లేకపోతే ఈటల రాజేందర్ లేదా ధర్మపురి  అర్వింద్ కో బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని పార్టీలో చర్చలు జరుగుతోంది. అంతా అయిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు ముందు కొత్తగా ఎవరికి బాధ్యతలు ఇచ్చినా ఉపయోగం ఉంటుందా అనేది అసలు పాయింట్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: