అమరావతి : జగన్ ‘పొటాటో’తో కొత్త తలనొప్పులు

Vijaya


తిరుపతి జిల్లాలోని వాకాడు ప్రాంతంలో తుపాను బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి నోరుజారటంపై  రెండుపార్టీల మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తోంది. పాలకులు లేదా ఎవరైనా ప్రముఖులు మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో జగన్ మాటలే ఉదాహరణ. బాధితులతో జగన్ మాట్లాడుతు అందించిన నిత్యావసర వస్తువుల జాబితాను చదివారు. ఆ జాబితాను చదువుతున్నపుడు పొటాటో అని చెప్పి తెలుగులో ఉల్లిగడ్డనే కదా అంటారు అని అడిగారు.



పక్కనే కూర్చున్న వాళ్ళెవరో పొటాటో అంటే బంగాళదుంప అని సరిచేశారు. దాన్ని జగన్ వ్యతిరేకులు ముఖ్యంగా టీడీపీ నేతలు, క్యాడర్ గట్టిగా పట్టుకున్నారు. ఉల్లిగడ్డకు బంగాళదుంపకు కూడా తేడా తెలీదా అంటు సోషల్ మీడియాలో  సెటైర్లు వేస్తున్నారు. ఎవరో క్యాడర్ లేదా నెటిజన్లు ఎద్దేవా చేశారంటే అర్ధముంది. స్వయంగా చంద్రబాబునాయుడు, లోకేషే దీన్ని గట్టిగా హైలైట్ చేసి జగన్ పై దుమ్మెత్తిపోశారు. దాంతో మొత్తం తమ్ముళ్ళంతా రంగంలోకి దిగేశారు.



జగన్ కు బంగాళదుంపకు  ఉల్లిగడ్డకు తేడా తెలీదని మీడియా సమావేశాలు పెట్టి మరీ ఎగతాళి చేస్తున్నారు. అందుకనే మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్ తప్పు మాట్లాడారంటే మాట్లాడారు లేదంటే లేదు. అసలే జగన్ అంటే చంద్రబాబు, లోకేష్ అండ్ కోకి ఎంత మంటుందో అందరికీ తెలిసిందే. ఇపుడు అవకాశం వచ్చింది కాబట్టి జగన్ కు వ్యతిరేకంగా దుమ్ముదులిపేస్తున్నారు. మాట్లాడేటపుడు ఇలాంటి పొరబాట్లకు చంద్రబాబు, లోకేష్ చాలా ఫేమస్. గతంలో వీళ్ళుమాట్లాడిన మాటలను వైసీపీ ఇపుడు వైరల్ చేస్తోంది.



బంగాళదుంపలకు ఉల్లిగడ్డకు కూడా తేడా తెలీని జగన్ ఇక రాష్ట్రాన్ని ఏమి పాలిస్తాడంటు చంద్రబాబు, లోకేష్ చాలా ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. పరిపాలనకు, ఉల్లిగడ్డ+బంగాళదుంపలకు సంబంధమే లేదు. అయినాసరే అవకాశం దొరికింది కాబట్టి తండ్రి, కొడుకులిద్దరు పదేపదే ‘జగన్ పొటాటో’ నే  ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా జగన్ పై నెగిటివ్ ట్రోలింగ్ చేయటానికి పచ్చబ్యాచ్ మొత్తానికి స్వయంగా జగనే పెద్ద అవకాశం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: