రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్న సీయం రేవంత్...!!

murali krishna
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలకు విమర్శలు చేసేందుకు ఏ మాత్రం తావివ్వటం లేదు. ప్రత్యర్థి పార్టీలకు ఏమాత్రం అవకాశం లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.తెలంగాణ రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన నాటినుండి పరిపాలనపై తనదైన మార్కు వేస్తున్న రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకోవడంలో వెనక్కు తగ్గటం లేదు.తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తనదైన దూకుడు చూపిస్తున్నారు. తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దుబారా ఖర్చుల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా అందరినీ ఆకట్టుకునేలా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా తన సొంత కారుని వాడుతున్నారు.కొత్త కాన్వాయ్ కొనుగోలు పట్ల విముఖత వ్యక్తం చేసిన ఆయన బుల్లెట్ ప్రూఫ్ కార్ కావాలని అధికారులు చెప్పినప్పటికీ తన కార్ కే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయించాలని పేర్కొన్నారు. అంతేకాదు కాన్వాయ్ లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని సూచించారు.సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డికి తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చిందని ఆయన వంట మనిషి ఫోన్ చేసి రేవంత్ రెడ్డికి చెప్పారు.

ఇలా అయితే నిన్ను పనిలో నుండి తీసేస్తా అని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే తనకు వంట చెయ్యాలని, ఇంటి భోజనమే తాను చేస్తానని పేర్కొని వంట మనిషికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. తన భోజనం విషయంలో ప్రోటోకాల్ లాంటివేవీ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే రేవంత్ అన్నీ ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటున్న క్రమంలో ఇంటి వంటమనిషికి రేవంత్ రెడ్డి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ వెలుగులోకి వచ్చింది.ఒక పక్క తన ఫ్యామిలీకి కూడా ఎలాంటి ప్రోటోకాల్ అవసరం లేదని, తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ను ఆపాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇలా సంచలన నిర్ణయాలతో గత సీఎం లకు భిన్నంగా రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. తానూ అందరిలాగా కాదని చెప్తున్నారు. తన చర్యలతో తెలంగాణా రాష్ట్ర ప్రజల దృష్టిని రేవంత్ రెడ్డి ఆకట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: