ఉత్తరాంధ్ర : పవన్ కు ఇకనుండి ఇద్దరు బాసులా ?
ఇపుడిదే అంశం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇప్పటికే పవన్ కల్యాన్ జనసేన అధినేత అయ్యుండీ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పినట్లే నడుచుకుంటున్నారనే గోల అందరికీ తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపీ నేతలు విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవల్లో జరగుతున్నది కూడా దాదాపు ఇలాగే ఉంటోంది.
టీడీపీతో పొత్తుపెట్టుకివటం జనసేనలో చాలామంది నేతలకు, క్యాడర్ కు ఏమాత్రం ఇష్టంలేదన్న విషయం తెలిసిందే. అందుకనే టీడీపీతో పొత్తుపెట్టుకోవటాన్ని ఇష్టపడని వాళ్ళని పవన్ పార్టీ వదిలేసి వెళ్ళిపోమని బహిరంగంగానే హెచ్చరించింది. పవన్ నిర్ణయం చాలామంది నేతలకు, క్యాడర్ కు ఇష్టంలేదన్న విషయం జనసేన అధినేత హెచ్చరికతోనే బయటపడింది. దానికి అదనంగా టీడీపీ నేతలు ఏమన్నా జనసేన నేతలు రియాక్టు కాకూడదని, తమ్ముళ్ళని ఎవరూ ఏమనద్దని పవన్ పదేపదే వార్నింగులిచ్చారు. దాంతో పవన్ కు కూడా చంద్రబాబే బాస్ అన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.
ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే తాజాగా లోకేష్ పాదయాత్ర యువగళం ముగింపు బహిరంగసభకు పవన్ హాజరయ్యారు. లోకేష్ కు బాగా హైప్ ఇవ్వటానికి ఉద్దేశించిన బహిరంగసభ కాబట్టి కచ్చితంగా పవన్ కూడా లోకేష్ ను ఆకాశానికి ఎత్తేయక తప్పలేదు. దాంతో చంద్రబాబునే కాదు చివరకు లోకేష్ ఆధిపత్యాన్ని కూడా పవన్ ఆమోదించినట్లయ్యింది. పైగా ఈ బహిరంగసభలో పవన్ను తమ్ముళ్ళెవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అందుకనే టీడీపీ బహిరంగసభకు పవన్ హాజరు కాకపోతే బాగుండని మొదటినుండి జనసేన నేతలు అనుకుంటునే ఉన్నారు. కానీ నాదెండ్ల మనోహర్ సలహా తప్ప ఇంకెవరి సలహాను పట్టించుకునే అలవాటు లేని పవన్ వెళ్ళి వేదికమీద కూర్చున్నారు. ముందసలు బహిరంగసభకు హాజరుకాననే పవన్ చెప్పారు. కానీ తర్వాత చంద్రబాబు పవన్ ఇంటికి వెళ్ళి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో ఏమైందో ఏమో చివరకు బహిరంగసభకు హాజరయ్యారు. అప్పటినుండే పవన్ డౌన్ ఫాల్ స్టార్టయ్యింది.