ఇదేంటి జగన్‌.. ఆ పని చేసినా తప్పేనా?

Chakravarthi Kalyan
కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాట.  కానీ కలలు కనండి అవి నిజమయ్యాయి అనే భ్రమలో బతకండి అని చెబుతోంది ఎల్లో మీడియా.  ఏపీలో పెట్టుబడులు రావడం లేదంటూ.. రాష్ట్రం దివాళా తీస్తోందని.. పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయంటూ వైసీపీ ప్రభుత్వంపై అర్థం లేని ఆరోపణలు గుప్పిస్తుంటారు.


ప్రముఖ పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీలు రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి వస్తే వారిపై  విషపు రాతలు రాస్తుంటారు. వచ్చే పరిశ్రమల గురించి వార్తలు రాయరు. కానీ నిర్మాణాలే మొదలు పెట్టని అమరావతి మాత్రం సింగపూర్ అయిపోయింది అని మనల్ని ఊహల్లో ముంచెత్తుతారు. ఆ భ్రమల్లోనే మనల్ని ఉండేలా చేస్తారు. వచ్చిన పరిశ్రమల గురించి ఇసుమంతైనా వార్తలు రాయని ఎల్లో మీడియా రానీ కంపెనీలు, ఇక్కడ భూములు తీసుకొని పనులు మొదలు పెట్టని కంపెనీలు తిరిగి వెళ్తే మాత్రం ఏదో అయిపోతుంది అన్నట్లు విషయాన్ని పెద్దగా చేసి చూపిస్తుంటారు.


ఎన్నికలకు ఆరు నెలల ముందు భూములు తీసుకొని పరిశ్రమలకు సంబంధించిన పనులు ఆరంభించకముందే జగన్ హయాంలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయ్ అంటూ చెబుతుంటారు. గతంలో టీడీపీ హయాంలో రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పి తర్వాత లెక్కలు చూస్తే రూ.80వేల కోట్లే వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం వైసీపీ హయాంలో రూ.లక్షల కోట్లే వస్తున్నాయి.  అయినా వీటి గురించి చెప్పరు.


ఆసియా పేపర్ మిల్స్  సంస్థ 2018లో ఏపీలో రూ.24,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.  ఈ కాగితపు పరిశ్రమకు నాటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన కూడా చేశారు. సదరు సంస్థ 2019లో కూడా పనులు ప్రారంభించకపోవడంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సదరు కంపెనీ పనులు ప్రారంభించకపోవడంతో జగన్ ప్రభుత్వం వాటి అనుమతులు రద్దు చేసింది. దీంతో మరోసారి వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ తో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టింది అని రాసుకొచ్చింది ఎల్లో మీడియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: