అమరావతి : చంద్రబాబుకు జరగబోయేది ఇదేనా ?
చివరకు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు ఎటూ కాకుండా పోతారేమో అనిపిస్తోంది. తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకోవటమే మొదటినుండి చంద్రబాబులోని సమస్య. ఒకపుడు ఈ పద్దతి చెల్లుబాటైంది కానీ ఇపుడు చంద్రబాబు వ్యూహాలన్నీ ఎదురుతంతున్నాయి. అయినా తన పద్దతిని ఏమాత్రం మార్చుకోవటంలేదు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీకి జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అయితే బీజేపీని కలుపుకోకుండా ఒక్క జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవటం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టంలేదు. అందుకనే కమలంతో పొత్తుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు.
సీన్ కట్ చేస్తే తాజాగా బెంగుళూరు విమానాశ్రయంలో కాంగ్రెస్ ప్రముఖ నేత డీకే శివకుమార్ తో మంతనాలు జరిపారు. ఎయిర్ పోర్టులో ఎదురుపడిన ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవటంతో ఆగలేదు. సెక్యూరిటిని పక్కనపెట్టి విడిగా వెళ్ళి మాట్లడుకున్నారు. దాంతో కాంగ్రెస్ తో కూడా చంద్రబాబు చేతులు కలపబోతున్నారా అనే ప్రచారం మొదలైపోయింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రచారం విషయంలో ఆశ్చర్యపోవటటంలేదు.
ఇది సరిపోదన్నట్లు వైఎస్ షర్మిల నుండి నారా లోకేష్ కు క్రిస్మస్ కానుకలు అందాయి. లోకేష్ కు క్రిస్మస్ కానుకలను పంపాల్సిన అవసరం షర్మిలకు ఏమాత్రం లేదు. షర్మిల క్రిస్మస్ కానుకులు పంపిన రెడు రోజులకే బెంగుళూరు ఎయిర్ పోర్టులో డీకే-చంద్రబాబు మంతనాలు జరిగాయి. ఈ రెండు కూడా కాకతాళీయంగా జరిగిందని అనుకునేందుకు లేదు. రెండు డెవలప్మెంట్ల వెనుక ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. తొందరలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరి సారధ్య బాధ్యతలు అందుకోబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే.
అంటే ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు మరోవైపు డీకేతో ఏకాంతంగా ఎలా ముచ్చట్లాడుతారు ? లోకేష్ కు షర్మిల క్రిస్మస్ కానుకలు పంపటంఏమిటి ? ఆ డెవలప్మెంట్లు బీజేపీ అగ్రనేతలకు తెలీకుండానే ఉంటుందా ? చంద్రబాబంటేనే విశ్వసనీయతలేని వ్యక్తనే ముద్రుంది. దానికి తోడు ఏకకాలంలో డబుల్ గేమ్ ఆడుతున్నారు. ఇందుకనే చివరకు ఎటూ కాకుండా పోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.