అమరావతి : పవన్ కు కాంగ్రెస్ షాక్ తప్పదా ?

Vijaya


రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ రూపంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తప్పేట్లు లేదు. ఎలాగైనా సరే వైసీపీని ఓడించాలన్న పంతంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని పదేపదే పవన్ చెబుతున్నారు. అందుకనే చంద్రబాబునాయుడుతో చేతులు కలిపారు. తన మిత్రపక్షం బీజేపీని కూడా టీడీపీ, జనసేన పొత్తుకు ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు పార్టీలు ఏకమైతే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయినట్లే అన్నది పవన్ ఆలోచన.





వామపక్షాలు, కాంగ్రెస్ ను పట్టించుకోవాల్సిన అవసరంలేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీలోని సడెన్ డెవలప్మెంట్లను చూసిన తర్వాత పవన్ వ్యూహం పారేట్లుగా లేదు. దీనికి కారణం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో సుమారు 20 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని జగన్ డిసైడ్ చేయటమే. అలాగే కొందరు మంత్రులు, ఎంఎల్ఏలకు నియోజకవర్గాలను మార్చబోతున్నారు. అయితే జగన్ ఆలోచనలతో విభేదించే ఎంఎల్ఏల్లో కొందరైనా  తొందరలోనే పార్టీని వదిలేస్తారని అంచనా వేస్తున్నారు.





వైసీపీని వదిలేసే ఎంఎల్ఏలు టీడీపీ, జనసేనలో కాకుండా కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నారు.  వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ లో చేరటానికి చాలామంది ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారని ప్రచారం మొదలైంది. సరిగ్గా ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ ఇన్చార్జి మాణిక్కం ఠాకూర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుందన్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన మోడీ ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్ధితుల్లో లేవని చెప్పారు.





బీజేపీకి మిత్రపక్షమైన కారణంగా జనసేన, బీజేపీతో పొత్తుపెట్టుకోవాలన్న వెంపర్లాటలో చంద్రబాబు, తన అవసరాల కోసం జగన్ కేంద్రాన్ని నిలదీసే పరిస్ధితుల్లో లేరని మాణిక్కం చెప్పారు. కాబట్టి జనాలు కాంగ్రెస్ ను ఆధిరించాలని మాణిక్కం విజ్ఞప్తి చేశారు. మాణిక్కం చేసిన విజ్ఞప్తి ఒకరకంగా కరెక్టే అని చెప్పాలి. షర్మిల బాధ్యతలు తీసుకుని, వైసీపీ, టీడీపీ అసంతృప్త నేతలంతా కాంగ్రెస్ లో చేరి పోటీచేస్తే అప్పుడు హస్తంపార్టీ సడెన్ గా పుంజుకోవటం గ్యారెంటీ. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలదన్న పవన్ కు షాక్ తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: