అమరావతి : చంద్రబాబు దూకుడు పెంచుతున్నారా ?

Vijaya


కొత్తసంవత్సరం కావచ్చు లేదా గెలుపుమీద పూర్తిగా నమ్మకం కుదరకపోవచ్చు మొత్తంమీద చంద్రబాబునాయుడు దూకుడు పెంచుతున్నారు. ఎన్నికలకు ఇక వందరోజులే ఉన్నదనే విషయం అందరికీ తెలిసిందే. ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశముందని అందరు అనుకుంటున్నదే. అప్పటికి రాష్ట్రమంతా పర్యటన చేసేయాలని చంద్రబాబు టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకు జనవరి 5వ తేదీని ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో మొదటి బహిరంగసభ నిర్వహించాలని టీడీపీ డిసైడ్ అయ్యింది.





5వ తేదీన కనిగిరి బహిరంగసభతో మొదలవ్వబోతున్న దూకుడు 29వ తేదీన అనంతపురం బహిరంగసభతో మొదటి రౌండ్ పూర్తవ్వబోతోంది. అంటే 24 రోజుల్లో 25 బహిరంగసభలు జరపాలని, అన్నింటిలోను తానే పాల్గొనేట్లుగా చంద్రబాబు షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. మధ్యలో ఒక్కోరోజు విశ్రాంతికి కేటాయించారు. అందుకోసమే ఒక్కోరోజు రెండు అవసరమైతే మూడు, నాలుగు బహిరంగసభలకు కూడా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక బహిరంగసభ జరపాలని చంద్రబాబు తమ్ముళ్ళకు చెప్పారు.





అయితే చంద్రబాబు నిర్ణయంతో తమ్ముళ్ళు విభేదిస్తున్నారు. రోజుకు ఒక బహిరంగసభ లేదా రెండంటే ఓకే కానీ మూడు, నాలుగంటే కష్టమని చెప్పేశారు. జనసమీకరణ చేయటం తలకు మించిన పనవుతుందని తమ్ముళ్ళు భయపడుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు. అందుకనే బహిరంగసభల షెడ్యూల్లో మార్పులు చేసుకోమని సూచించారు.  అయితే తమ్ముళ్ళ సూచనకు చంద్రబాబు అంగీకరించలేదని పార్టీవర్గాల సమాచారం. స్పీడుగా ఉంటేకాని 24 రోజుల్లో 25 బహిరంగసభల్లో పాల్గొనటం సాధ్యంకాదని చంద్రబాబు చెబుతున్నారట. కొన్నిసభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పాల్గొంటారని సమాచారం.





పార్టీకి అనుబంధంగా ఉన్న కులసంఘాలలన్నింటినీ బహిరంగసభల నిర్వహణ, జనసమీకరణలో ఇన్వాల్వ్ చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తానికి 24 రోజుల్లో 25 బహిరంగసభల్లో పాల్గొనటమంటే మామూలు విషయం కాదు. 74 ఏళ్ళ వయసులో రోజుకు మూడు, నాలుగు బహిరంగసభల్లో మాట్లాడేందుకు చంద్రబాబు రెడీ అవ్వటం గొప్ప విషయమే. చంద్రబాబు అయితే షెడ్యూల్  ప్రకారం  రెడీ అయిపోతున్నారు.  మరి 25 బహిరంగసభల నిర్వహణలో తమ్ముళ్ళు ఏమిచేస్తారనేది ఆసక్తిగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: