అమరావతి : జగన్ పై అప్పు బురదను చల్లేస్తున్నారా ?
తెలుగుదేశంపార్టీ-ఎల్లోమీడియా మధ్య సమన్వయం చాలా చక్కగా ఉంటుంది. పాలు, నీళ్ళు కలిసిపోయిన పద్దతిలో కో ఆర్డినేషన్ ఉంటుంది. ప్రత్యర్ధులపై బురదచల్లేయాలని డిసైడ్ అయితే రెండుకలిసి చాలా ప్లాన్డుగా పనిమొదలుపెడతాయి. అలాగే ఎవరికైనా లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నా అదే పద్దతిలో హైప్ ఇస్తాయి. అవసరంలేదని అనుకుంటే తీసిపడేయటం కూడా అలాగే ఉంటుంది. ఇపుడిదంతా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై చాలా జాగ్రత్తగా బురదచల్లేస్తున్నారు.
కనిగిరి బహిరంగసభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతు రాష్ట్రం అప్పును రు.13 లక్షలకు చేర్చారు. ఎల్లోమీడియా కూడా రాష్ట్రం అప్పు రు. 13 లక్షలని పదేపదే కథనాలిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ, ఎల్లోమీడియాకు బీజేపీతో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ఫుల్లుగా వంతపాడుతున్నాయి. రాష్ట్రం అప్పులు రు. 4.52 లక్షల కోట్లని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులోనే ప్రకటించినా ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా ఒప్పుకోవటంలేదు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏకంగా కేంద్రమంత్రినే చాలెంజ్ చేశారు.
మొదట్లో రాష్ట్రం అప్పు రు. 5 లక్షల కోట్లన్నారు. తర్వాత 7 లక్షల కోట్లకు పెంచారు. తర్వాత రు. 10 లక్షల కోట్లకు చేర్చారు. ఇపుడేమో రు. 13 లక్షల కోట్లంటున్నారు. ఈ అప్పులో చంద్రబాబు హయాంలో జరిగిన లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా కలిసుందన్న విషయం బయటపెట్టరు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశాడని బురదచల్లేయటమే వీళ్ళందరి టార్గెట్. అందుకనే అప్పులను తమిష్టంవచ్చినట్లు పెంచుకుంటూ పోతున్నారు.
అప్పట్లో అంటే జగన్ పైన అక్రమాస్తుల కేసులు నమోదైనపుడు కూడా టీడీపీ+ఎల్లోమీడియా ఇలాగే కూడబలుక్కున్నాయి. జగన్ దోపిడి లక్ష కోట్లతో మొదలై రు. 5 లక్షల కోట్లకు పెంచారు. ఈ సంఖ్య సరిపోలేదనుకుని ఏకంగా రు. 16 లక్షల కోట్లకు పెంచేశారు. అయితే 16 లక్షల కోట్లంటే జనాలు నమ్మరని మళ్ళీ లక్ష కోట్లకు దింపారు. చివరకు రు. 43 వేల కోట్ల దగ్గర స్ధిరపడ్డారు. ఇంతాచేసి జగన్ కేసులను దర్యాప్తుచేసిన జేడీ లక్ష్మీనారాయణ చెప్పింది కేవలం రు. 800 కోట్ల అవినీతిపైన ఆరోపణలున్నాయని మాత్రమే. జగన్ పైన ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే ఒక్క కేసు కూడా నిరూపణకాలేదు.