అమరావతి : అన్నదమ్ముల సవాల్..హోరా హోరీ తప్పదా ?

Vijaya

రాబోయే ఎన్నికల్లో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ జరగబోతోంది. అదేమిటంటే అన్నదమ్ముల సవాల్. విజయవాడ పార్లమెంటుకు అన్నదమ్ములు కేశినేని నాని, కేశినేని చిన్ని రెండుపార్టీల తరపున పోటీచేయటం దాదాపు ఖాయమని తేలిపోయింది. చంద్రబాబునాయుడు, కొందరు తమ్ముళ్ళతో పడలేక కేశినేని నాని టీడీపీలో నుండి బయటకు వచ్చేశారు. రాబోయే ఎన్నికల్లో తనకు చంద్రబాబు టికెట్ ఇవ్వరని తేలిపోయిన తర్వాతే కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశారు. వెంటనే జగన్మోహన్ రెడ్డిని కలిశారు.



జగన్ తో భేటి తర్వాత ఎంపీ వ్యాఖ్యలను చూసిన తర్వాత వచ్చేఎన్నికల్లో విజయవాడ నుండి వైసీపీ తరపున నానీయే పోటీచేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ఎంపీ టికెట్ హామీ తీసుకున్న తర్వాతే నాని జగన్ను కలిశారు. ఇక్కడ విషయం ఏమిటంటే వైసీపీకి కూడా విజయవాడ ఎంపీగా గట్టి నేతలు దొరకటంలేదు. గడచిన రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయవాడలో గెలవాలని జగన్ పట్టుదలగా ఉన్నా గట్టి అభ్యర్ధి దొరకటంలేదు. సరిగ్గా ఈ సమయంలోనే టీడీపీలో నుండి కేశానేని బయటకు వచ్చేశారు.



ఇక టీడీపీ తరపున ఎంపీగా కేశినేని చిన్ని పోటీచేయటం దాదాపు ఖాయమే. సీటు నిలుపుకోవాలని, నానిని ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు అండ్ కో తో పాటు చిన్ని కూడా శతవిధాల ప్రయత్నాలు చేస్తారనటంలో సందేహంలేదు. విజయవాడ ఎంపీగా చిన్ని ఓడిపోతే చంద్రబాబు పరువంతా పోతుంది. ఇదే సమయంలో చిన్నిని ఓడించేందుకు నాని కూడా తీవ్రంగా ప్రయత్నిస్తారనటంలో సందేహంలేదు. రాబోయే ఎన్నికల్లో గెలిచి చంద్రబాబును చావుదెబ్బ కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ్ముడు, చంద్రబాబు అంటే నానికి బాగా మండిపోతోంది.



ఎన్నికల్లో గెలిచి తన కసినంతా తీర్చుకోవాలని నాని బాగా పట్టుదలగా ఉన్నారు. కాబట్టి ఇద్దరు అభ్యర్ధులు వ్యక్తిగతంగా, రెండు పార్టీల మధ్య పోటీ చాలా తీవ్రస్ధాయిలో ఉండటం ఖాయమనే అనిపిస్తోంది. పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల ఎంపిక ఆధారంగా నాని-చిన్నిల పోటీ ఎలా జరుగబోతోందన్న విషయం తేలిపోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: