అమరావతి : బాలినేనితో తలనొప్పులు తప్పవా ?

Vijaya


మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలిగింది కరెక్టే, సాధించిందీ కరెక్టే అని పార్టీ వర్గాల టాక్. బాలినేని చీటికి మాటికీ అలగటం చాలా ఎక్కువైపోయింది.  అలగటం పార్టీకి దూరంగా ఉండటం జగన్మోహన్ రెడ్డి ఆఫీసు నుండి కబురు రావటం బుజ్జగించటం మామూలైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్ తో భేటీకి రావాలని హైదరాబాద్ లో ఉన్నబాలినేనిని పార్టీ కీలకనేతలు కబురుచేసి రప్పించారు. బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నా జగన్ తో భేటీ సాధ్యంకాలేదు.





ఎంతసేపు వెయిట్ చేసినా ఉపయోగంలేకపోవటంతో జగన్  వ్యవహారశైలిపై బాలినేని అలిగి వెంటనే బయలుదేరేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలోనే వెయిట్ చేయమని బాలినేని కీలక నేతలు ఎంత అడిగినా ఉండకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారని సమాచారం. తర్వాత ముఖ్యనేతలకు బాలినేని అందుబాటులోకి రాలేదని పార్టీవర్గాల టాక్. మరీఅలక ఎన్నిరోజులుంటుందో ఎప్పటికి అలక వీడుతారో చూడాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకవైపు అభ్యర్ధుల ఖరారులో జగన్ ఫుల్లు బిజీగా ఉన్నారని తెలిసి కూడా తాను రాగానే మాట్లాడలేదని అలిగి వెళ్ళిపోవటం ఏమిటో ఆశ్చర్యంగా ఉంది.




ఇక రెండో అంశం సాధించటం ఏమిటంటే రెండు టికెట్లు సాధించారట. ఒకటి ఒంగోలులో ఎంఎల్ఏగా బాలినేనికి జగన్ టికెట్ ఓకే చెప్పారట. మొదట్లో ఒంగోలుకు బదులు గిద్దలూరులో పోటీచేయాలని చెప్పారు. అయితే గిద్దలూరుకు మారటం బాలినేనికి ఏమాత్రం ఇష్టంలేదు. అందుకనే తన సీటు కోసం పట్టుబట్టారట. అలాగే ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులరెడ్డికే మళ్ళీ టికెట్ ఇచ్చేట్లుగా జగన్ పై ఒత్తిడి తెచ్చి సాధించుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.




మాగుంటకు ఒంగోలు ఎంపీగా జగన్ టికెట్ ఇవ్వదలచుకోలేదట. అయితే బాలినేని పట్టుబట్టి జగన్ తో మాట్లాడి మాగుంటకు కూడా టికెట్ సాధించారు. మామూలుగా అయితే వైవీ సుబ్బారెడ్డే ఎంపీగా పోటీచేయాలి. అయితే వైవీకి బాలినేనికి ఏమాత్రం పడటంలేదు. అందుకనే మాగుంట కోసం జగన్ పై బాలినేని బాగా పట్టుబట్టారు. దాంతో బాలినేని ఒత్తిడికి జగన్ తలొంచినట్లు అర్ధమవుతోంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: