పవన్ తో వైసీపీకి హ్యాండ్ ఇచ్చిన ఎంపీ?

Purushottham Vinay
రీసెంట్ గా వైసీపీకి ఆ పార్టీ మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను జనసేన పార్టీలో చేరబోతున్నట్టు బాలశౌరి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్‌ వేదికగా ప్రకటించారు.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా జనసేనాని పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌ లోని పవన్‌ కళ్యాణ్ నివాసంలో బాలశౌరి కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం తెలుస్తోంది.ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా ఉన్న బాలశౌరిని వచ్చే ఎన్నికల్లో అదే స్థానంలో జనసేన పార్టీ అభ్యర్థిగా దింపే ఆలోచనలో పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ఉన్నారని టాక్‌ నడుస్తోంది. మచిలీపట్నం కాకుంటే కృష్ణా జిల్లాలోని పెడన, అవనిగడ్డ ఇంకా కైకలూరు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని చెబుతున్నారు.ఇక ఈ మూడు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గం జనాభా అత్యధికం. అయితే బాలశౌరి కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం.వచ్చే ఎలక్షన్స్ లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపైనే పవన్, బాలశౌరి మధ్య చర్చ జరిగినట్టు సమాచారం తెలుస్తోంది. గుంటూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని బాలశౌరి.. పవన్‌ కళ్యాణ్ కు చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది.



అయితే గుంటూరు ఎంపీ స్థానంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని, అంతేకాకుండా గత రెండు పర్యాయాలు టీడీపీనే అక్కడ గెలిచిందని పవన్‌ కళ్యాణ్ చెప్పినట్టు తెలుస్తోంది.మధ్యేమార్గంగా మచిలీపట్నం ఎంపీ స్థానం, పెడన, కైకలూరు ఇంకా అవనిగడ్డ అసెంబ్లీ స్థానాల్లో ఎక్కడ నుంచైనా పోటీ చేయడానికి తనకు అభ్యంతరం లేదని పవన్‌ కళ్యాణ్‌ చెప్పినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బాలశౌరి కూడా తాను ఆలోచించుకుని ఏ విషయం చెబుతానని పవన్‌ కళ్యాణ్ కు తెలిపినట్టు తెలుస్తోంది. బాలశౌరి అవనిగడ్డ లేదా పెడన నుంచి దాదాపు పోటీ చేయడం కూడా ఖాయమని అంటున్నారు.ఇంకా అలాగే పార్టీలో చేరికపైన కూడా బాలశౌరి చర్చించారని చెబుతున్నారు. మచిలీపట్నంలో భారీ బహిరంగ సభను నిర్వహించి అక్కడ జనసేన పార్టీలో చేరతానని పవన్‌ కళ్యాణ్ కు తెలిపినట్టు సమాచారం తెలుస్తుంది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున జనసేకరణకు ఇప్పటికే బాలశౌరి అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. ఈ సభలోనే పవన్‌ కళ్యాణ్ సమక్షంలో బాలశౌరి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: