షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్ధం వీడియో వైరల్?

Purushottham Vinay
ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌ శివారు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్‌ లో గురువారం నాడు చాలా గ్రాండ్ గా ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.ఈ వేడుకకు షర్మిల అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, ఇంకా ఆయన సతీమణి వైఎస్‌ భారతి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక ఈ సందర్భంగా కాబోయే జంటను పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఆ తరువాత మేనల్లుడిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్న జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా ఆ వేడుకలో జగన్, పవన్  ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా షర్మిళ స్పందించారు. ఇందులో భాగంగా రెండు కీలకమైన పోస్టులు చేశారు. ఇక అందులో ఒకటి కృతజ్ఞతలు చెప్పేది కాగా.. మరొకటి చిన్నపాటి అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించేది.



వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు రాజారెడ్డి నిశ్చితార్ధం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం తరువాత ఆన్ లైన్ లో స్పందించిన షర్మిళ... "రాజా, ప్రియకు అభినందనలు. మీరు ఎప్పుడూ ఇలానే కలిసుండేలా ఆ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ వేడుకకు వచ్చి నా కొడుకు, కాబోయే కోడలిని ఆశీర్వదించిన ప్రియమైన వారందరికీ, రాలేకపోయినవారందరికీ కృతజ్ఞతలు" అని అన్నారు.అలాగే మరొక పోస్టులో ... "నా కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకకు తరలివచ్చిన అతిథులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. స్నేహితులు, బంధువులు, అభిమానులు ఊహించిన దానికంటే ఎక్కువగా విచ్చేయడంతో చిన్నపాటి అసౌకర్యం కలిగిందని తెలిసి చింతిస్తున్నాను. నూతన వధువరులను మంచి మనసుతో ఆశీర్వదించిన మీ అందరికి మరొక్కసారి కృతఙ్ఞతలు" అని తెలిపారు. ఈ పోస్టులని ఆమె వీడియోతో చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: