అమరావతి : ఇద్దరూ ఉత్తరాంద్ర మీదే దృష్టిపెట్టారా ?

Vijaya


ఫైనల్ గా అన్నా చెల్లెళ్ళ సవాలు మొదలైంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి తన ప్రచారాన్ని జగన్ ఈనెల 25 లేదా 27వ తేదీన ఉత్తరాంధ్రలోని భీమిలీ నుండి మొదలుపెట్టబోతున్నారు. మొదట్లో తన పర్యటనను 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పూర్తి చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈనెలగానే టికెట్లను ఫైనల్ చేసేసి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు.



ఇందులో భాగంగానే ఇప్పటికి 60 అసెంబ్లీ, 10 లోక్ సభ అభ్యర్ధులను ఫైనల్ చేశారు. బహుశా ఐదో జాబితాను కూడా తొందరలోనే ప్రకటించేసి పర్యటనలకు రెడీ అయిపోవచ్చని పార్టీ వర్గాల టాక్. భీమిలీ నుండి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెడితే కలిసొస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఇదే సమయంలో సోదరి వైఎస్ షర్మిల ఆదివారం విజయవాడలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న సందర్భంగా ఆమె జగన్ పైన నొటికొచ్చిన ఆరోపణలు చేశారు.



జగన్ పైన షర్మిల చేసిన ఆరోపణల్లో ఎక్కువభాగం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియా, దగ్గుబాటి పురందేశ్వరి చేస్తున్నవే. సరే,  ఈ విషయాలను పక్కనపెట్టేస్తే  అధ్యక్షురాలిగా షర్మిల రాష్ట్రంలో పర్యటించాలని అనుకున్నారు. పాదయాత్రకు సమయం లేదు కాబట్టి బస్సుయాత్రను మొదలుపెట్టబోతున్నారు. ఆ బస్సుయాత్రను కూడా షర్మిల ఉత్తరాంధ్ర నుండే మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు. శ్రీకాకుళంలోని ఇచ్చాపురం నుండి యాత్రను మొదలుపెట్టబోతున్నారు. మామూలుగా ఇచ్చాపురంను బస్సుయాత్ర, పాదయాత్ర ముగింపు సభలకు వాడుకుంటారు.



అయితే షర్మిల మాత్రం వెరైటీగా ఇచ్చాపురాన్ని యాత్ర ప్రారంభానికి వాడుకుంటున్నారు. అంటే జగన్ విశాఖపట్నంలోని భీమిలీ నుండి ప్రచారం మొదలుపెడుతుంటే షర్మిల శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుండి ప్రారంభించబోతున్నారు. ప్రచారం ఎక్కడినుండి మొదలుపెడుతున్నా షర్మిల టార్గెట్ అంతా తన సోదరుడు జగనే అని బాధ్యతల స్వీకారం సందర్భంగా స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి యాత్ర పొడువునా ముందు జగన్ పైన తర్వాత కొంచెం చంద్రబాబు పైన ఆరోపణలు, విమర్శలు చేయటం ఖాయం. మరి కాంగ్రెస్ బద్ధశతృవు బీజేపీని ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: