షాక్: ముద్రగడ దెబ్బకు పవన్ కు పెద్ద దెబ్బే..!!

Divya
కాపు ఉద్యమ నేతగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా పొలిటికల్ రంగం వైపు మళ్లీ మరొకసారి అడుగు వేయబోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో టిడిపి ప్రభుత్వం హయాంలో కాపు ఉద్యమాన్ని సైతం మొదలుపెట్టి చాలా సంచలనమే సృష్టించారు.. అయితే ఆ ఉద్యమాన్ని సైతం అణిచివేసేందుకు చాలా రకాలుగా ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా ముద్రగడ కుటుంబాన్ని సైతం వేధింపులకు గురయ్యేలా చేశారు అప్పటినుంచి టిడిపి పైన చంద్రబాబు పైన చాలా విమర్శలు చేస్తూ ఉండేవారు ముద్రగడ.. దీంతో ఆయన వైసీపీలోకి చేరుతున్నారని ప్రచారం కొంతమంది గిట్టని వాళ్లు చేశారు.

అందుకు తగ్గట్టుగానే ఆయన స్టేట్మెంట్లు ఉండడంతో పాటు ముద్రగడ పైన అనేక సమస్యల పైన ఏపీ ప్రభుత్వం లేఖలు రాయడం దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగానే స్పందించడంతో కచ్చితంగా ఈయన వైసీపీలో చేరుతారని భావించారు.. కానీ ముద్రగడ తాను వైసీపీలోకి చేరడం లేదంటూ ఇటీవల క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీంతో జనసేన పార్టీలోకి చేరబోతున్నారని ప్రచారం అయితే చాలా గట్టిగా వినిపించింది.. స్వయంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముద్రగడ ఇంటికి వెళ్లి మరి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని అందరూ అనుకున్నారు.

అయితే ఇప్పుడు అలాంటి విషయం జరగకుండానే ముద్రగడ మనసు మార్చుకున్నట్లుగా పలు రకాల సంకేతాలు కనిపిస్తున్నాయి.. ముఖ్యంగా జనసేనలో చేరేందుకు ముద్రగడతో పాటు ఆయన కుమారుడు సిద్ధంగానే ఉన్న సీట్ల విషయంలో ఇంకా క్లారిటీ లేకపోవడంతో ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించగా చంద్రబాబు నుంచి క్లారిటీ వచ్చిన తర్వాతే తాను ఏ విషయాన్ని అయినా చెబుతాను అంటూ చెప్పారట. సీఎం పదవి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ముద్రగడ ప్రశ్నించారట.. చంద్రబాబు నుంచి స్పష్టమైన హామీ రాలేదని.. సీఎం పదవి షేరింగ్ విషయంలో కూడా ఇంకా ఎక్కడా క్లారిటీ రాలేదని అందుకే ముద్రగడ కూడా కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.. టిడిపి జనసేన పొత్తుతో కచ్చితంగా కాపులంతా ఐక్యమై టిడిపి అభ్యర్థులకు సహకరించాలని చెప్పడంతో.. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి అధికారం దక్కాలని ఇదంతా చేస్తున్నారని తాను అయితే సిద్ధంగా లేను ఇలాంటి పని చేయడానికి అని ముద్రగడ తేల్చినట్లు సమాచారం. ఇవే కాకుండా అన్నిటికీ చంద్రబాబు పైన ఆధారపడితే అసలు పార్టీ ఎందుకని కూడా ముద్రగడ ప్రశ్నించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: