ఒక్క జగన్ ని ఓడించడానికి ఇన్ని కుటుంబాలు ఏకం కావాలా.. దట్ ఇస్ జగన్..!!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాబోయే ఎన్నికల్లో చాలా రసవత్తంగా చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రాలో జరిగిన ఎన్నికలకు ఈసారి భిన్నంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది.ముఖ్యంగా ఇటు షర్మిల అటు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నాచెల్లెళ్ల మధ్య యుద్ధం తో పాటు వదిన మరదలు అయిన చంద్రబాబు, పురందేశ్వరి తో మధ్య పోటాపోటీగా ఎన్నికలు జరగబోతున్నాయి. వీటితో పాటు ఎలక్షన్స్ కోసం ఏపీ ప్రజలు కూడా చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అధికారం పార్టీలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి మళ్లీ ఎలాగైనా అధికారంలోకి రావాలని సంక్షేమ పథకాలతోనే ప్రజలలోకి వెళ్ళబోతున్నట్లు తెలిపారు.


ముఖ్యంగా టికెట్ల కేటాయింపు విషయంలో కూడా సర్వేల ఆధారంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తమ మంత్రులకు టికెట్లు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ అధ్యక్షురాలుగా సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా తన అన్నను టార్గెట్ చేస్తున్నారు. దీంతో అన్నాచెల్లెళ్ల మధ్య కాస్త యుద్ధం కొనసాగుతోందని చెప్పవచ్చు. ఇరువురి మధ్య మాటల తూటాలు కూడా పేలుతు ఉన్నాయి. ఇదంతా ఇలా ఉండగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికలకు సిద్ధమయ్యారు.


బిజెపితో కూడా తమతో కలిసి వస్తుందేమో అని చంద్రబాబు ఎదురు చూస్తున్నారు. బిజెపి కూడా తమతోపాటు కలిస్తే కచ్చితంగా గెలుస్తామని ధీమాతో చంద్రబాబు ఉన్నారు. ఈ మేరకు అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉన్నారు.చంద్రబాబు వదిన పురందేశ్వరి వచ్చే ఎన్నికలలో పొత్తుల పైన వెళ్లాలని ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్టుగా పలు రకాల ప్రణాళికలు చేస్తున్నారు పురుందేశ్వరి.. టిడిపి తో పొత్తు క్లారిటీ లేకపోవడంతో మధ్య కూడా వార్ జరగబోతుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఒక జగన్ను ఓడించడానికి అటు టిడిపి, జనసేన ,బిజెపి, షర్మిల ఇలా అన్ని కుటుంబాలు కూడా ఒకటవుతున్నాయని తెలిసి వైసీపీ నేతలు.. అభిమానులు సైతం ఇన్ని పార్టీలు ఎయకమవుతున్నాయి అంటే దట్ ఇస్ జగన్ పవర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: