మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై రాళ్ళ దాడి?

Purushottham Vinay
తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. కెసిఆర్ ప్రభుత్వం ఓడి కాంగ్రెస్ గెలిచి జెండా పాతింది. రేవంత్ రెడ్డి తెలంగాణాలో కాంగ్రెస్ ని ఒంటి చేత్తో గెలిపించి సీఎం అయ్యాడు. ఇక ప్రస్తుతం అందరి కన్ను ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఉంది. మునుపేన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ఆసక్తికరంగా ఇంకా రసవత్తరంగా ఉన్నాయి.పల్నాడు జిల్లాలోని ముప్పాళ్ళ మండలంకి చెందిన తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.వారు చేసిన ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.ఇక పరిస్థితి చేయి దాటిపోవడంతో కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.జెండా ఆవిష్కరణతో పాటు పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొనాల్సి ఉండగా గుర్తు తెలియని దుండగులు పథకం ప్రకారం దాడి చేశారు. లైట్లు ఆర్పివేసి, భవనాలపై నుంచి ఒక్కసారిగా రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో కన్నా వ్యక్తిగత సహాయకుడితో పాటు 15 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇక బందోబస్తుకు వచ్చిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు.



ఇప్పుడు తొండపి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఈ రాళ్ల దాడిపై కన్నా లక్ష్మినారాయణ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందన్నారు. రాక్షస పాలనకు చరమగీతం పాడాలనే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు ఈ రాళ్ల దాడికి చేయించినట్లుగా కన్నా ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని కన్నా అన్నారు.కావాలనే ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అంబటి రాంబాబు దాడులు చేయించారని, రాళ్ల దాడి చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నాడని కన్నా విమర్శించారు. వీళ్ళు చేసిన ప్రతి చర్యకు ఓటుతో సమాధానం చెబుతారని హెచ్చరించారు. దాడిలో గాయపడిన కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు కన్నా లక్ష్మినారాయణ. ఇటువంటి దాడులు పార్టీ నాయకులు, కార్యకర్తలని భయపెట్టలేవని, మరింత సంఘటితంగా పోరాడేలా చేస్తాయని కన్నా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: