అమరావతి : ఓటర్లజాబితాపై ఎల్లోమీడియా సేమ్ సైడ్ గోల్
మొత్తానికి ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్లజాబితా సక్రమంగానే ఉందని ఎల్లోమీడియా అంగీకరించింది. ఇంతకాలం అక్కడ దొంగోట్లు, ఇక్కడ దొంగఓట్లంటు నానా గోలచేసింది. దొంగఓట్లకు బాధ్యతంతా వైసీపీదే అని తేల్చేసింది. టీడీపీకి అసలు దొంగఓట్లు అంటేనే ఏమిటో తెలీదన్నట్లుగా వెనకేసుకొచ్చింది. దొంగఓట్లు నమోదుచేయించటం ద్వారా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని అధికారపార్టీ కుట్రపన్నుతోందని నానా రచ్చచేస్తోంది. అలాంటిది తాజాగా ‘మీ ఓటును ఓడించాలని’ అనే హెడ్డింగుతో పే...ద్ద బ్యానర్ స్టోరీని అచ్చేసింది.
ఈ స్టోరీలో కూడా దొంగఓట్లున్నాయని అందుకు వైసీపీదే బాధ్యతన్నట్లుగా స్టోరి ఇచ్చింది. అయితే తనకు తెలీకుండానే ఓటర్ల జాబితా సక్రమమన్న సర్టిఫికేట్ కూడా హెడ్డింగులోనే ఇచ్చేసింది. విషయం ఏమిటంటే ఎన్నికలసంఘం విడుదలచేసిన తుది ఓటర్లజాబితాను ఎల్లోమీడియా ప్రతినిధులు సర్వేచేశారట. ఆ పరిశీలనలో చాలా అవకతవకలు బయటపడ్డాయని చెప్పింది. 25,820 ఓట్లను పరిశీలిస్తే 4.88 శాతం అక్రమాలు, అవకతవకలు, లోపాలే అని తీర్పిచ్చేసింది. ఇక్కడ ఎల్లోమీడియా మరచిపోయిందేమిటంటే 4.88 శాతం ఓట్లలోనే తప్పులు దొర్లాయంటే మిగిలిన 95.22 శాతం కరెక్టన్నట్లే కదా.
25,820 ఓట్లలో 4.88 శాతంలో తప్పులున్నాయంటే ఎన్నిఓట్లు 1260 మాత్రమే. 5-10 శాతం మధ్యలో ఎర్రర్స్ ఉండటం చాలా సహజం. కానీ ఇక్కడ కనిపించిన తప్పులు కేవలం 4.88 శాతం మాత్రమే. 4.88 శాతం తప్పులున్నాయని గోలచేస్తున్న ఎల్లోమీడియా 95.22 శాతం కరెక్టే అని అంగీకరించినట్లే కదా. పైగా తప్పుల బాధ్యతంతా అచ్చంగా వైసీపీదే అని తేల్చేసింది. దొంగఓట్లు చేర్పించటంలో, జెనూయిన్ ఓట్లను తొలగించేట్లు చేయటంలో టీడీపీ కూడా ఏమీ తక్కువ తినలేదు.
టీడీపీ చేర్పించిన దొంగఓట్లను, డబల్ ఓట్లను, లక్షలాది జెనూయిన్ ఓట్లను దొంగోట్లుగా టీడీపీ చేసిన ఫిర్యాదులపై ఆధారాలతో సహా వైసీపీ సీనియర్ నేతలు కేంద్ర ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి దొంగఓట్లు చేర్పించటం, జెనూయిన్ ఓట్లను తీయించేయటంలో రెండుపార్టీల బాధ్యతా ఉండచ్చు. అంతేకాని తప్పులన్నీ వైసీపీదే అని టీడీపీ శుద్ధపూసని ఎల్లోమీడియా సర్టిపికేట్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఇంతకాలానికి ఎన్నికల కమీషన్ రిలీజ్ చేసిన ఓటర్లజాబితా కరెక్టే అని తనకు తెలీకుండానే అంగీకరించేసింది.