Ap cm:చంద్రబాబుని చంద్రముఖి చేశావు కదయ్యా..!!

Divya
మరి కొద్ది రోజులలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలోనే అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీ టిడిపి ఇద్దరు కూడా ప్రజలలో మమేకం అయ్యేలా తిరుగుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో టిడిపి ప్రభుత్వం ఎక్కువగా దుష్ప్రచారాలు చేస్తూ ఉండడంతో నిన్నటి రోజున ఒక సభలో జగన్ ఇలాంటి ఎల్లో వైరస్ మీద తనదైన స్టైల్ లో పంచులు వేస్తూ వైసిపి కార్యకర్తలకు ఉత్సాహాన్ని ఇచ్చారు. ఏలూరులోని దెందులూరు లో నిర్వహించిన సిద్ధం సభలో జగన్ పాల్గొన్నారు.


ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రామాయణ మహాభారతంలో ఉన్న విలన్ళ్లంతా మన రాష్ట్రంలోనే తిరుగుతున్నారని ప్రజలు కృష్ణుడి పాత్ర పోషించి అర్జునుడు అయిన తనను కౌరవుల నుంచి కాపాడాలంటూ పిలుపునిచ్చారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఫ్యాన్ బటన్ నొక్కితే గత ఎన్నికలలో బటన్ నొక్కి పెట్టెలో బంధించినటువంటి ఈ చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా ఉండకూడదంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం చంద్రముఖి లక లక అంటూ టీ గ్లాస్ పట్టుకొని మళ్లీ సైకలెత్తి మన రక్తం తాగడానికి సిద్ధంగా ఉంది.. రా కదలిరా అంటూ దత్తపుత్రుడినీ వేసుకొని ఆయన వదినమ్మ ను వేసుకొని పిలుపునిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.


తోడేలన్నీ ఒక్కొక్కటిగా ఒకటవుతున్నాయి..ఆ తోడేళ్లకు జగన్ ఒంటరిగానే కనిపిస్తారు.. కానీ తనకు మాత్రం ప్రజలు, దేవుడు తోడుగా ఉన్నారని చెప్పుకొచ్చారు.. చంద్రబాబు జీవితంలో మూడుసార్లు సీఎం అయ్యారు 14 ఏళ్ళు సీఎంగా చేసిన ఆయన ప్రజల కోసం ఏం చేశారంటూ ప్రశ్నించారు.. ఒక్క రూపాయి అయినా ప్రజల ఖాతాలో వేశారా అంటూ ప్రశ్నించారు.. జన్మభూమి కమిటీలతో లంచాలను మారుపేరుగా ఉందని మన ప్రభుత్వంలో నుంచి ఇచ్చాపురం వరకు సచివాలయాలను ఏర్పాటు చేసి వాటి ద్వారానే ఎన్నో సేవలు అందిస్తున్నామని.. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంటి వద్దకే పథకాలు అందిస్తున్నామని తెలిపారు మీకోసం 57 నెలలు 124 సార్లు బటన్ నొక్కాను.. జగనన్న కోసం మీరు ఒక్కసారి ఫ్యాన్ బటన్ నొక్కితే చాలు అంటూ తెలిపారు. దీంతో పలువురు అభిమానులు చంద్రబాబుని చంద్రముఖితో పోల్చావు కదయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: