అమరావతి : వైసీపీలో ఫుల్లు జోష్

Vijaya

అధికారపార్టీలో ఒక్కసారిగా ఫుల్లు జోష్ పెరిగిపోయింది. కారణం ఏమిటంటే ప్రముఖ మీడియా సంస్ధ టైమ్స్ నౌ తాజా సర్వేనే. టైమ్స్ నౌ దేశవ్యాప్తంగా ఏ కూటమికి లేదా పార్టీకి ఎన్ని లోక్ సభ సీట్లు వస్తాయనే విషయంలో సర్వే చేసింది. ఇందులో భాగంగానే ఏపీ విషయానికి వస్తే వైసీపీ 19 పార్లమెంటు సీట్లలో గెలుస్తుందని తేలింది. టీడీపీ+జనసేన కూటమికి 6 సీట్లు వస్తాయని తేల్చింది. కాంగ్రెస్, బీజేపీలకు ఒక్కటంటే ఒక్క సీటు కూడా దక్కదని తేల్చేసింది.



పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీకి 47.6 శాతం ఓట్ షేరు దక్కుతుందని సర్వేలో తేలింది. అలాగే టీడీపీ+జనసేన కూటమికి 44.4 శాతం ఓట్ షేర్ దక్కుతుందని సర్వే చెప్పింది. కాంగ్రెస్ కు 1.5 శాతం ఓట్లు, బీజేపీకి 2.1 శాతం ఓట్లు వస్తాయట. టౌమ్స్ నౌ తరపున ఈ సర్వే జనవరి చివరి వారం నుండి ఫిబ్రవరి మొదటివారంలో జరిగింది. తాజా సర్వే కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉందని అనిపిస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా లోక్ సభ ఫలితాలపై ఇదే మీడియా సర్వే చేసి ఫలితాలను విడుదలచేసింది.



అప్పట్లో వైసీపీ, టీడీపీ, జనసేన ఏ పార్టీకి ఆపార్టీ విడివిడిగా పోటీచేస్తే అన్నప్రాతిపదకన సర్వే చేసింది. కాబట్టి డెఫనెట్ గా వైసీపీకే ఎక్కువ మొగ్గుంటుందని తమ్ముళ్ళు వాదించారు. అయితే తాజా సర్వే మాత్రం వైసీపీ ఒంటరిగా, టీడీపీ+జనసేన కూటమిగా పోటీచేస్తే అనే ప్రాతిపదికన సర్వే చేసింది. కాకపోతే అప్పటికి ఇప్పటికి పొలిటికల్ డెవలప్మెంట్లు వేగంగా మారిపోతున్నాయి. సర్వే వివరాలు వెలుగు చూసేనాటికి టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి మూడుపార్టీల కూటమి ప్రాతిపదికన ఇంకో సర్వే చేస్తే ఫలితాలు ఎలాగుంటాయో చూడాలి.



ఇక్కడ వైసీపీ నేతల జోష్ ఏమిటంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి పోలింగ్ జరుగుతోంది. లోక్ సభలో వైసీపీకి రాబోయే ఓట్ల షేర్ 47.6 శాతం అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపు ఇంతే ఓటు షేర్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  ఇదే ఓట్ షేర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వస్తే సుమారు 120 సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అవుతారన్నదే వైసీపీ నేతల జోష్ కు ముఖ్య కారణం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: