వైయస్ షర్మిల -బ్రదర్ అనిల్ లవ్ స్టోరీ గురించి తెలుసా..?

Divya
వైయస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా అటు ఏపీ సీఎం జగన్ చెల్లెలిగా కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ycp ప్రభుత్వం 2019లో గెలవడానికి ఈమె పాత్ర కూడా చాలా కీలకమని చెప్పవచ్చు.. కొన్ని కారణాల చేత తెలంగాణలో వైయస్సార్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి పాదయాత్రలు చేసినప్పటికీ ఇటీవల తెలంగాణ ఎన్నికల కోటి నుంచి తప్పుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అయితే ఇదంతా రాజకీయంగానే అని చెప్పవచ్చు కానీ ఈ పర్సనల్ విషయానికి వస్తే చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

షర్మిల బ్రదర్ అనిల్ కుమార్ ను ప్రేమించి వివాహం చేసుకుంది.. అయితే మీరు లవ్ స్టోరీ గురించి ఒక ఇంటర్వ్యూలో షర్మిల తెలిపింది.. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.. షర్మిల చదువుకునే రోజులలో ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాదుకు వెళ్ళిందట. మొదటిసారి బ్రదర్ అనిల్ కుమార్ ని కలిసిందట.. షర్మిల ఫ్రెండ్స్ తో ఏర్పాటు చేసిన ఒక మీటింగ్కు అనిల్ కుమార్ కూడా వచ్చారట. ఈ మీటింగ్ తర్వాత అప్పుడప్పుడు ఇద్దరు కలుస్తూ ఉండే వారిని.. అలాంటి సమయంలో అనిల్ కుమార్ ముందుగానే షర్మిల కి ప్రపోజ్ చేశారట.
అయితే ఆ సమయంలో అతను క్రైస్తవ మతంలోకి మారలేదు.. అనిల్ కుమార్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఈ పెళ్లికి షర్మిల తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ముందుగా అంగీకరించలేదట. అయితే.. అందుకు కారణం ఇద్దరు కుటుంబాల మధ్య అలవాట్లు పద్ధతులు వేరుగా ఉంటాయని షర్మిల కి నచ్చ చెప్పారట.. అయితే షర్మిల మాత్రం తాను పద్ధతుల విషయంలో ఎలాగైనా ఉండగలనని అనిల్ కుమార్ ఒప్పించి మరి వివాహం చేసుకున్నట్లు ఒప్పించి మరి వివాహం చేసుకున్నట్లు తెలియజేసింది. షర్మిల నాన్ వెజ్ తినడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని బ్రదర్ అనిల్ కుమార్ కూడా తెలిపారుట.తమ జీవితం సంతోషంగా కొనసాగుతోందని తెలియజేసింది షర్మిల. తన రాజకీయ విషయంలో కూడా బ్రదర్ అనిల్ కుమార్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని తెలిపింది వీరికి ఇద్దరు పిల్లలు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: