రెండేళ్లలో ప్రధాన మోడీని చంపేస్తాం..వార్నింగ్ ఇస్తున్న రైతులు.. వీడియో వైరల్..!!

Divya
గత కొద్ది రోజులుగా చాలా మంది రైతులు ఢిల్లీలో పంటకు కనీసం మద్దతు ధరతో పాటు ఇతర డిమాండ్లను సైతం నెరవేర్చాలంటూ చాలా మంది రైతు సంఘాలు చలో ఢిల్లీ అనే పేరుతో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..పంజాబ్ నుంచి రైతుల శంభు, ఖానౌరి ప్రదేశాలకు వచ్చి మరి నిరసనలు తెలియజేస్తున్నారు. గత పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్నటువంటి పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడికి మోహరించారు.. ముఖ్యంగా భారీకేడ్లు, కాంక్రీట్ దిమ్మెలు ఇనుప కంచెలను సైతం ఏర్పాటు చేసుకున్నారు. అయినప్పటికీ వాటిని తొలగించుకొని రైతులు సైతం ముందుకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇలాంటి సమయంలోనే పోలీసులు రైతుల పైన భాస్పవాయువు రబ్బర్ బుల్లెట్లను సైతం ఉపయోగించారు. అయితే దేశ రాజధాని సరిహద్దులలో కొనసాగుతున్నటువంటి ఈ ఆందోళనలో ఒక వర్గం రైతులలో నుంచి ప్రధాన మోడీ పైన ఆయన ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఆగ్రహాన్ని సైతం తెలియజేశారు. ప్రధాని మోడీని సైతం బెదిరిస్తూ అనేక వీడియోలను కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చేస్తున్నారు.. పంజాబ్లో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు గుణపాఠం చెబుతామంటూ కొంతమంది పేర్కొంటున్నారు.


ఇప్పుడు తాజాగా బెదిరింపుకు దిగబడుతూ రెండు మూడేళ్ల ప్రధాన మోడీని చంపేస్తామంటూ పలువురు రైతులు బహిరంగంగా వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు.. అయితే ఇందులో మాట్లాడిన వ్యక్తి ఉగ్రవాదుడిగా రైతుల గుంపులో కలిసిపోయి ఇలా ఆందోళన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ విషయం పైన పలువురు నేటిజెన్లు సైతం మండిపడుతున్నారు.. ఇలాంటివి చేయడం వల్ల అటు రైతులు మాట్లాడుతున్నారో లేకపోతే దేశద్రోహులు మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ స్వేచ్ఛ అంటే ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయం పైన అటు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలను తీసుకుంటుందో తెలియాల్సి ఉన్నది. దీంతో అక్కడ పోలీసులు అప్రమత్తమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: