సీట్లు ప్రకటించక ముందే టిడిపి జనసేన మధ్య విభేదాలు..!!

Divya
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి.. అయితే ఇరువురు పార్టీల మధ్య పొత్తు అయితే కుదిరింది..కానీ కార్యకర్తలలో అభిమానుల్లో మాత్రం ఇంకా ఇలాంటి పొత్తు కుదరలేదు. సీట్లు పంపిణీ విషయం ఇంకా కొలిక్కి రాకముందే ఎన్నో నియోజకవర్గాలలో ఇరువురు పార్టీల మధ్య పలు రకాల విభేదాలు బయటపడుతున్నాయి. ఇలా ఇరువురు పార్టీలు సైతం బహిరంగంగానే తన్నుకుంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా టిడిపి కార్యకర్తలు ఒక వీడియో ద్వారా హెచ్చరిస్తున్నారు.


కాకినాడ సీటు జనసేనకు ఇస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తామంటూ కూడా తెలియజేస్తున్నారు.. దీంతో జనసేన టిడిపి పొత్తు పెట్టుకున్నప్పటికీ సీట్ల పంపకం ఇంకా జరగలేదు. కానీ ఎక్కడికక్కడ నేతలు మాత్రం టికెట్ తమకే అంటూ తమకే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయం రెండు పార్టీల మధ్య చిచ్చు రాజేష్ ఎలా కనిపిస్తోంది టిడిపిని కాదని కాకినాడ రూరల్ టికెట్ కు జనసేనకు ఇస్తే ఆ పార్టీ అభ్యర్థులను ఓడిస్తామంటూ టీడీపీ కార్యకర్తలే తెలుపుతున్నారు. టిడిపి నుంచి మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి టికెట్ ఆశిస్తున్నప్పటికీ జనసేన పార్టీ నుంచి పంతం నానాజీ సీటు ఆశిస్తున్నారట.


అయితే జనసేన పార్టీకి టికెట్ ఇస్తే టిడిపి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాకినాడ లోక్సభ స్థానంతో పాటుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే టికెట్ కూడా జనసేనకు ఇస్తే ఇక టిడిపి పార్టీ ఎందుకు అన్నట్టుగా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.. తమ నేత అనంతలక్ష్మి కి కాదని జనసేనకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ హెచ్చరిస్తున్నారు.. ఇటు జనసేన క్యాడర్ కూడా కాకినాడ రూరల్ టికెట్ తమకే అన్నట్టుగా తెలియజేస్తున్నారు మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటుందో చూడాలి మరి కానీ కాకినాడ రూరల్ టికెట్టు మాత్రం ఇరువురు పార్టీల మధ్య విభేదాలు తారస్థాయికి వెళ్లేలా చేస్తున్నాయి. అయితే ఈ విషయం పైన మాత్రం జనసేన నాయకులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: