టీడీపీలోకి ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన వైసీపీ యంగ్ ఎంపీ?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి బాగా హీట్ పుట్టిస్తుంది.ఈసారి ఎవరు గెలుస్తారో అన్న సందేహాలు జనాల్లో ఎక్కువ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది నేతలు కూడా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. ఇక రీసెంట్ గా వైసీపీకి రాజీనామా చేసిన యంగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు.. తెలుగుదేశం పార్టీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు.నిజానికి మరోసారి నరసరావు పేట నుంచే పోటీ చేయాలని భావిస్తున్న ఆయనకు.. వైసీపీ గుంటూరు నుంచి పోటీ చేయాలని చెప్పిందని.. అందువల్ల ఆయన చాలా హర్ట్ అయ్యారని.. అందుకే సైకిల్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారని అంటున్నారు. అయితే ఈమధ్య ఆయన తిరిగి వైసీపీలోకి రాబోతున్నారనే ఊహాగాణాలు కూడా తెరపైకి వచ్చాయి.ఈ క్రమంలో పార్టీ మార్పుపైనా ఇంకా టీడీపీలో చేరికపైనా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు క్లారిటీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాను త్వరలో తెలుగు దేశం పార్టీలో జాయిన్ అవ్వబోతున్నట్లు శ్రీ కృష్ణ దేవరాయాలు వెల్లడించారు.



ఈ మేరకు నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. ఇక ఇందులో భాగంగా తాను పార్టీ మార్పు గురించి చెబుతూనే... వచ్చే ఎన్నికల్లో కూడా తనను గెలిపించాలని ప్రజలను కోరారు.ఇక ఈ నేపథ్యంలో చాలా రకాల సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేసినట్లు చెప్పిన ఆయన... మరోసారి ఛాన్స్ ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని లేఖలో పేర్కొన్నారు. దీంతో లావు శ్రీకృష్ణదేవరాయులు తెలుగుదేశం చేరడంపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి నరసరావు పేట ఎంపీగా పోటీ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు... తెలుగు దేశం పార్టీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావుపై ఏకంగా 1,53,978 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరుతుండటంతో... మాజీమంత్రి అనీల్ కుమార్ యాదవ్ ను ఈసారి నరసరావుపేట ఎంపీగా బరిలోకి దించారు జగన్. మరి ఈ రసవత్తరపోరులో విజయం ఎవరికి దక్కుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: