హైదరాబాద్ : మోడీవి కూడా పసలేని ఆరోపణలేనా ?

Vijaya


దేశ ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి చెప్పే మాటల్లో తప్పుండకూడదు.  చేసే ఆరోపణల్లో పూర్తిగా నిజాలే అయ్యుండాలని జనాలు కోరుకుంటారు. కాని ప్రధానమంత్రి కూడా సగటు రాజకీయ  నేతల్లాగే నోటికేదొస్తే అది మాట్లాడేసి, అసంబద్ధమైన ఆరోపణలను చేస్తే ఎలాగుంటుంది ? నరేంద్రమోడి చేసిన ఆరోపణల్లాగే ఉంటుంది. ఇంతకీ విషయం ఏమిటంటే రెండురోజుల మోడీ హైదరాబాద్ పర్యటన పూర్తయిపోయింది.





రెండోరోజు మంగళవారం ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యముందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీయార్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడినట్లు మోడీ చెప్పారు. కేసీయార్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు విచారణ చేయించలేదనే పసలేని ఆరోపణలు చేశారు. నిజానికి మోడీ చేసిన ఆరోపణలు ఏమాత్రం లాజిక్కులేనిదిగానే కనబడుతోంది.  ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి మూడునెలలు మాత్రమే అయ్యింది. మూడునెలల్లోనే అంతకుముందు కేసీయార్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించటం పూర్తిగా సాధ్యంకాదు.  





ఎందుకంటే కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే విషయం తేలాలంటే ముందు ఇంటర్నల్ విచారణ జరపాలి. శాఖాపరమైన విచారణలో తేలే అంశాలను బట్టి తర్వాత విచారణ కమిటినీ నియమిస్తుంది ఏ ప్రభుత్వమైనా. నిజానికి కేసీయార్ ప్రభుత్వం మీద యాక్షన్ తీసుకోలేని అసమర్ధ ప్రభుత్వం కేంద్రమే అనిచెప్పాలి. ఎందుకంటే కేసీయార్ ప్రభుత్వం పదేళ్ళున్నట్లే మోడీ ప్రభుత్వం కూడా పదేళ్ళుంది.  అనుమతి లేకుండానే కేసీయార్  కాళేశ్వరం ప్రాజెక్టును కడుతుంటే కేంద్రప్రభుత్వం ఏమిచేస్తోంది.





కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని తెలిసిన తర్వాత మోడీ ఎందుకు విచారణ చేయించలేదు, ఎందుకని కేసీయార్ మీద  యాక్షన్ తీసుకోలేకపోయారు ? తన పరిధిలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోలేకపోయిన నరేంద్రమోడీ ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కేంద్రప్రభుత్వం పరిఆధిలోకి వస్తాయని మోడీకి తెలీదా ? అవినీతి చేయటానికి కేసీయార్ ను ఇంతకాలం మోడీ ఎందుకు అనుమతించినట్లు ? ఏపీలోని పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా మోడీ ఇదే చేశారు. పోలవరం ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారని, పోలవరంను ఏటీఎంగా వాడుకున్నారని ఆరోపించిన మోడీ మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు ?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: