సీఎం జగన్ ని పొగడ్తలతో ముంచేస్తున్న సుమన్..!!

Divya
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాసంస్థలలో తీసుకువచ్చిన మార్పుల గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. ఇప్పటివరకు ఎ ప్రభుత్వం చేయని విధంగా పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ముఖ్యంగా నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేశారు.. అలాగే ప్రైవేటు పాఠశాలలకు దీటుగానే ప్రభుత్వ బడులను కూడా సిద్ధం చేశారు. పేద విద్యార్థులకు కూడా ఇంగ్లీష్ మీడియాన్ నీ ప్రవేశపెట్టి వారి చదువులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.. ఇప్పటికే ఏపీ విద్యా వ్యవస్థ పైన పలువురు సెలబ్రిటీలు నాయకుల సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.


తాజాగా సినీ నటుడు సుమన్ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ప్రశంసలు కురిపిస్తున్నారు.. ప్రభుత్వ పాఠశాల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చొరవ చాలా అద్భుతమని పట్టణాలలో పాఠశాలకు దీటుగా పల్లెలలో కూడా స్కూళ్లను ఏర్పాటు చేశారని వెల్లడించారు.. అలాగే ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు టాయిలెట్ల విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. నాడు నేడు స్కీం ద్వారా వాటర్ అన్నిటిని మార్చేశారని తెలియజేశారు.. అలాగే విద్యావ్యవస్థలలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన మార్పు గతంలో ఏ నాయకుడు కూడా చూపించలేదని తెలిపారు..



ఇటీవల రాజమండ్రి ప్రాంతాలలో పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన తరువాత తనకు ఈ విషయం తెలిసిందని వెల్లడించారు.. వాటిని చూసి తాను కూడా ఆశ్చర్యపోయానని విద్యావ్యవస్థ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కచ్చితంగా ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అంటూ వెల్లడించారు.. అలాగే మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు వారికే సపోర్ట్ చేయాలంటూ కూడా సుమన్ వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సుమన్ గారు ఒక పాఠశాలను సందర్శించి అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో మాట్లాడి పలు విషయాలను తెలుసుకున్న తర్వాతే తాను ఈ విధంగా మాట్లాడారని వెల్లడించారు.. గతంలో కూడా ప్రముఖ రచయిత కోన వెంకట్ కూడా ఇలాగే తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: