తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత కొడాలి నాని మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయాలన్న దురుదేశ్యంతోనే జూనియర్ ఎన్టీఆర్ ను చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబుపై నాని సంచలన ఆరోపణలు చేశారు.తమ కొడుకు లోకేష్ ను గెలిపించి సీనియర్ ఎన్టీఆర్ లాగానే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా బయటకు గెంటేసి టిడిపిని ఆక్రమించుకోవాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడుని సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు గొయ్యి తీసి పాతిపెట్టాలని, అప్పుడే తెలుగుదేశం పార్టీ తిరిగి బతికి బట్ట కడుతుందని చెప్పుకొచ్చారు. ఇంకా అనేక షాకింగ్ కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా పందుల్లా వస్తున్న చంద్రబాబు గుంపునకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు సర్వనాశనం చేశాడని, 2009 ఎన్నికలలో తారక్ ని వాడుకుని వదిలేశాడని దుయ్యబట్టారు.
అప్పట్లో ప్రమాదం జరిగితే జూనియర్ ఎన్టీఆర్ ప్రాణాలతో బయటపడ్డాడని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రముఖిని ఈవీఎంలలో బంధించాలని, రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించాలని ప్రజలకు కొడాలి నాని పిలుపునిచ్చారు. అంబేద్కర్ బాటలో నడుస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. మంచి చేస్తేనే ఓటు వేయమని దమ్ముగా, ధైర్యంగా అడుగుతున్న నేత జగన్ మోహన్ రెడ్డి అని, అందుకే ఆయనను సీఎం చేసి మరోసారి అత్యున్యత స్థానంలో కూర్చోబెట్టాలని కొడాలి నాని ప్రజలకు పిలుపునిచ్చారు.పేద ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి ఎంతగానో మేలు చేస్తున్నారని, 120 సార్లు బటన్ నొక్కి రెండున్నర లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ ఫలాలుగా అందించారని కొడాలి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను గెలిపించడం కోసం ఈవీఎంలలో ఫ్యాన్ గుర్తు నొక్కాలని ప్రజలకు నాని పిలుపునిచ్చారు. ఎంతమంది ఏకమై వచ్చినా జగన్ మోహన్ రెడ్డిను ఓడించలేరని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ రెండోసారి ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అలాగే సీఎంగా జగన్ మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారని కాన్ఫిడెంట్ గా చెప్పారు.