గోదావరి : వైసీపీకి సిగ్గనిపించటంలేదా ?

Vijaya

తాజా డెవలప్మెంట్లు చూసిన తర్వాత వైసీపీకి సిగ్గనిపించటం లేదా అని జనాలు చర్చించుకుంటున్నారు. విషయం ఏమిటంటే కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇంటికి వైసీపీ నేత జక్కంపూడి గణేష్ వెళ్ళారు. అక్కడి నుండే జాల్లా సమన్వయకర్త, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డితో ముద్రగడకు ఫోన్లో మాట్లాడించారు. ఎన్నికలకు ముందు ఎవరు ఎవరిని కలిసినా పార్టీలోకి ఆహ్వానించటానికే కదా. అలాగే వైసీపీలోకి రమ్మని ముద్రగడను ఎంపీ ఆహ్వానించారు. మరి ఇద్దరి మధ్య ఫోన్లో జరిగిన సంభాషణలు ఏమిటన్నది పూర్తిగా  తెలీటంలేదు.



ముద్రగడ ఇంటికి వైసీపీ నేత గణేష్ వెళ్ళారని తెలియగానే చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఈమధ్యనే వైసీపీని ముద్రగడ ఛీకొట్టారు. తనింటికి వైసీపీ నేతలు ఎవరు రావద్దని చెప్పారు. వైసీపీలో చేరే ఉద్దేశ్యం తనకు లేదని, తన కుటుంబసభ్యులెవరు ఆ పార్టీలో చేరబోరని ముద్రగడే ప్రకటించారు. ముద్రగడ కొడుకు ముద్రగడ గిరి మాట్లాడుతు తమ కుటుంబం జనసేనలో కాని లేదా టీడీపీలో కాని చేరబోతున్నట్లు చెప్పారు. తాము ఏ పార్టీలో చేరాలో డిసైడ్ చేసుకుని వైసీపీని ఛీ కొట్టిన ముద్రగడ ఇంటికి ఇపుడు ఆ పార్టీనేతలు వెళ్ళటాన్నే అందరు చెప్పుకుంటున్నారు.



తమింటికి రావద్దని ముద్రగడ ఛీ కొట్టినా ఇంకా ఏ మొహంపెట్టుకుని వైసీపీ నేతలు వెళ్ళారో అని జనాలు చెప్పుకుంటున్నారు. ముద్రగడను పార్టీలో చేర్చుకోవాలని అనుకున్న పవనే వెనక్కుతగ్గారు. అసలు జనసేన లేదా టీడీపీలో చేరుతామని ప్రకటించటానికి ముద్రగడ సిగ్గుపడాలి. ఎందుకంటే కాపు ఉద్యమంలో ముద్రగడతో పాటు ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసింది. ఇంట్లో ఆడవాళ్ళని పోలీసులు జుట్లు పట్టుకుని ఈడ్చుకుంటు, తిట్టుకుంటు రోడ్లమీద  లాక్కెళ్ళారు. గిరిని అయితే చచ్చేట్లు కొట్టారు. ముద్రగడను పోలీసులు నోటికొచ్చినట్లుగా బూతులు తిట్టారు.



తనతో పాటు కుటుంబానికి ఇంతవమానాలు జరిగినా పవన్ ఒక్కసారిగా కూడా నోరిప్పలేదు. అలాంటి చంద్రబాబు, పవన్ పార్టీల్లో చేరటానికి సిద్ధపడ్డారంటే ముద్రగడ వ్యక్తిత్వం ఎలాంటిదో అందరికీ అర్ధమైపోయింది. సరే ఆయన చేరితే చేరారు కాని వైసీపీ నేతలను ఇంటికి రావద్దని బహిరంగంగా ఛీకొట్టటమే ఆశ్చర్యమేసింది. అలాంటిది ఇపుడు ఆ పార్టీనేతలు ముద్రగడ ఇంటికి వెళ్ళటం, ముద్రగడ కూడా మిథున్ తో మాట్లాడారని తెలిసి అందరు ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: